BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్!
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అతి తక్కువ ధరకు సరికొత్త ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు కీలక రీఛార్జ్ ప్లాన్ వివరాలు ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ BSNL ప్రైవేట్ టెలికాం సంస్థలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ ధరలకు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది.
BSNL రూ.199తో అతి తక్కువ ధరకు ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులకు ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. దాంతో పాటుగా నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
Also Read: Air India 50 Percent Discount: ఎయిరిండియా శుభవార్త.. వారి టికెట్లపై 50శాతం డిస్కౌంట్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. అయితే రోజుకు 250 నిమిషాలు వాయిస్ కాల్స్ అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. దాంతోపాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న రూ.186 ప్రీపెయిడ్ ప్లాన్ స్థానంలో రూ.199 ప్లాన్ ప్రకటించింది. క్రిస్మస్, న్యూ ఇయర్ కానుకగా బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొస్తుంది. జనవరి 1 నుంచి సరికొత్త ప్లాన్ రీఛార్జ్‌లు అందుబాటులోకి రానున్నాయి.
టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రిలయన్స్ జియో (Reliance Jio)లో అతి తక్కువ ప్లాన్ రూ.249 ఉంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు కాగా, ప్రతిరోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 56జీబీ డేటా లభిస్తుంది. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. Reliance Jio నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ కాగా, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి మొత్తం 1000 నిమిషాలు అందిస్తోంది.
Also Read: Jio vs Vodafone, idea, Airtel: ఇంటర్నెట్ స్పీడ్‌లో ఏది ఎక్కువ ? ఏది తక్కువ తెలుసా ?
ఎయిర్‌టెల్‌లో అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్ రూ.298 ఉంది. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తోంది Airtel. ఫాస్ట్ ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్ ఉచితంగా పొందవచ్చు.
విలీనం అయిన కంపెనీ వొడాఫోన్ ఐడియా (VI)లో అతి తక్కువ ప్రిపెయడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.199. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజూ 1జీబీ డేటా, 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వాయిస్ కాల్స్ ఉచితం. కానీ ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే. దీంతో ఏ విధంగా చూసినా బీఎస్ఎన్ఎల్ తీసుకొస్తున్న తాజా ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పోటీ కంపెనీలకు షాకిచ్చే నిర్ణయమని చెప్పవచ్చు.
Also Read: Redmi 9 Power Specifications: రెడ్‌మి 9 పవర్ 4 రంగుల్లో లాంఛ్.. ధర, ఫీచర్లు ఇవే