BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్..!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 395 రోజుల అపరిత కాల్స్ తోపాటు డేటాను ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జీ ప్లాన్‌తో వినియోగదారులు ఏయే ప్రయోజనాలు పొందనున్నారో తెలుసుకుందాం.
ఈ 395 రోజుల రీఛార్జీ ప్లాన్ తో వినియోగదారులు ప్రతిరోజూ 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్ ప్రయోజనాలు పొందుతారు. ఎయిర్ టెల్ ఐడియాతో పోలిస్తే ఇది తక్కువకే అందుబాటులో ఉంది.
రూ. 2,399 ధరతో ఏడాదిపాటు ఈ ప్లాన్ ప్రయోజనాలు పొందే అవకాశం లభిస్తుంది. అంటే మనకు నెలకు దాదాపు రూ. 200 వర్తిస్తుంది. అయితే, ఇందులో ఇతర సదుపాయాలు కూడా ఉన్నాయి. జింగ్ మ్యూజిక్, బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్స్ అరేనా, గేమాన్ ఆస్ట్రోటెల్ కూడా పొందుతారు.
రిలయన్స్ జియో ఇటీవలె మొబైల్ ట్యారిఫ్ పెంచిన సంగతి తెలిసిందే. వీటి ఏడాది ప్లాన్స్ రూ. 2,999, రూ. 3599 అందుబాటులో ఉన్నాయి. ఇది 336 రోజులకు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు ప్రతిరోజూ 2.5 జీబీ డేటా,అపరిమిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలు పొందుతారు
వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో తమ రీఛార్జీ ట్యారిఫ్ ధరలను పంఎచేసింది. దీన్ని ఏడాది ప్లాన్స్ రూ. 2,899, రూ. 3,499 ఉన్నాయి. ఇవి 365 రోజులపాటు వర్తిస్తాయి.. ఇందులో మీరు ప్రతిరోజూ 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్,100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు.
ఎయిట్ టెల్ ధరలు కూడా పెరిగినాయి. వీటి ధరలు ఏడాదికి రూ. 1,799 ప్రస్తుతం రూ. 1,999 పెంచేశారు. ఇది ఏడాది వ్యాలిడిటతో 24 జీబీ డేటా, అపరిమిత కాల్స్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు పొందే అవకాశం లభిస్తుంది.