Farmers Loans: రైతులకు బంపర్ జాక్‌పాట్.. కొత్త ఏడాదిలో రూ.2 లక్షలు.. ఎలాగంటే..?
ఇటీవల బ్యాంకుల ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖ అధికారులు సమావేశం నిర్వహించి.. కీలక విషయాలపై చర్చించారు. రైతులకు అధిక మొత్తంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి సహకరించాలని రిక్వెస్ట్ చేశారు.
ఈ అభ్యర్థన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రైతుల కోసం మరో ముందడుగు వేసింది.
గతంలో ఈ లిమిట్ రూ.1.6 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు అధికారుల రిక్వెస్ట్ మేరకు మరో రూ.40 వేలు పెంచి.. రూ.2 లక్షలు చేసింది.
గతంలో ఈ లిమిట్ రూ.1.6 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు అధికారుల రిక్వెస్ట్ మేరకు మరో రూ.40 వేలు పెంచి.. రూ.2 లక్షలు చేసింది.
పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల మధ్య చిన్న, సూక్ష్మ రైతుల కోసం ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 86 శాతం కంటే ఎక్కువ చిన్న, అతి చిన్న హోల్డింగ్‌లు ఉన్న రైతులకు లబ్ధి చేకూరనుంది.
మారిన కొత్త రుణ నిబంధనలపై ఖాతాదారులకు సాధ్యమైనంత త్వరగా అవగాహన కల్పించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) లోన్‌లు కూడా సులభతరం చేసింది. ఈ స్కీమ్ కింద కేంద్రం 4 శాతం వడ్డీ రేటుతో రూ.3 లక్షల వరకు రుణాలను అందిస్తోంది. 12 కోట్ల మందికి పైగా రైతులు ఈ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు.