Business Idea: ఈ ఒక్క బిజినెస్‌ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. లక్షల్లో ఆమ్దాని తెస్తుంది..!

Tue, 08 Oct 2024-4:31 pm,

ఏ పార్టీళ్లు, పెళ్లిళ్లకు వెళ్లినా మనకు ఎప్పుడు అవసరమయ్యే, 365 రోజులపాటు డిమాండ్‌ ఉండే బిజినెస్‌ ఐడియా. దీంతో కేవలం కొన్ని రోజుల్లోనే మీరు లక్షాధికారి అయిపోవచ్చు. సాధారణంగా ఫంక్షన్లలో భోజనం విస్తారాకుల్లో ఏర్పాటు చేస్తారు.

ఆ మధ్య కాలంలో ఫైబర్‌ ప్లేట్లు కూడా పెట్టారు కానీ, కరోనా తర్వాత  ఆరోగ్య స్పృహ అందరిలో పెరగడం మొదలైంది. దీంతో ఎక్కువ శాతం వాడిన ప్లేట్లు మళ్లీ వాడకుండా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

విస్తారాకుల బిజినెస్‌ కూడా ఇప్పుడు మళ్లీ బాగా ఊపందుకుంటుంది. విస్తారాకులు అంటే ప్లాస్టిక్‌ పేపర్లతో తయారు చేసినవి కాకుండా చిగురు టాకుతో తయారు చేసినవి. ఇవి ఒడిశా, ఏపీ నుంచి ఎక్కవు మొత్తంలో హోల్‌సేల్‌ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. వీటిని ఈ మధ్య కాలంలో బాగా వినియోగిస్తున్నారు.  

అమ్మమ్మల కాలం నాడు ఎక్కువగా మోదుగ ఆకుతో విస్తారాకులు తయారుచేసి వాటిని వినియోగించేవారు. లేదంటే అరటి ఆకులు వినియోగించేవారు. వీటితో ఆరోగ్యం కూడా. అయితే, మారుతున్న కాలం ప్లాస్టిక్‌ ఆకులు తయారు చేస్తున్నారు. తక్కువ ఖర్చు అని తీసుకుంటున్నారు. కానీ, వీటి నుంచి దుర్వాసన వస్తుంది. వీటిలో తినడం వల్ల ఆరోగ్య సమస్యలు  కూడా.  

అయితే, ఎకో ఫ్రెండ్లీ బిజినెస్‌ ప్రారంభించాలంటే సహజ సిద్ధమైన ఆకులతో తయారు చేసే విస్తరాకుల బిజినెస్‌ ప్రారంభించండి. దీనికి మెషీన్‌ రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.  అదనంగా ఎక్కువ పనివారు కూడా అవసరం లేదు. ఇద్దరు కలిసి భాగస్వామ్యంతో పనిచేస్తే స్టార్టప్‌ మాదిరి పనివారి అవసరం కూడా ఉండదు. దీనికి కుట్టిన ఆకులను కొనుగోలు చేయాలి.   

ఇలా ఇద్దరితో స్టార్ట్‌ చేస్తే పెద్ద ఖర్చు ఏం కాదు. అయితే, ఫస్ట్‌ మౌత్‌ ద్వారానే ఉన్న సర్కిల్‌తో ప్రారంభించవచ్చు. ఆ తర్వాత మీ విస్తరాకులకు మార్కెటింగ్‌ మొదలు పెట్టాలి. ఆర్డర్లు తెచ్చుకోవాలి. మీరు కొనుగోలు చేసే మెషిన్‌ 6 డై లు వేస్తే చాలు. అంటే ప్రసాదం, టిఫిన్‌, లంచ్‌ ప్లేట్‌ సైజుల్లో తయారు చేసుకోవచ్చు.హోల్‌సేల్‌ వ్యాపారులను కలిసి అడ్వర్ట్‌టైజ్మెంట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. ఈ ఆకులు కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.  

ప్రతిరోజూ రెండు వేల విస్తారాకులు తయారు చేయవచ్చు. ఆన్‌లైన్‌ ప్లాట్‌ ఫారమ్స్‌పై అయితే, ఒక్కో విస్తరాకు రూ.10 కూడా విక్రయిస్తున్నారు. కావాల్సిన వస్తువులు.. ల్యామినేటెడ్‌ మెషీన్‌, హ్యాండ్‌మేడ్ గన్, సీలర్, ఆకులు, ప్యాక్‌ చేయడానికి కవర్స్.

కుట్టిన విస్తరాకులు విక్రయించే మంచి హోల్‌సేలర్‌ను కనుగుంటే ఈజీగా బిజినెస్‌ ప్రారంభించవచ్చు. దీనికి ఎక్కువ వేస్టేజ్‌కూడా కాదు.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link