Business Idea: రూ.2 లక్షల పెట్టుబడి.. పెడితే నెలకు రూ. లక్షకు పైగా ఆదాయం..ఇంతకంటే మించిన వ్యాపారం మరొకటి లేదు
Business Ideas: నేటి కాలంలో చాలా మంది సొంతంగా వ్యాపారం ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వారికి ఫ్లై యాష్ బ్రిక్స్ బిజినెస్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. మీరు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే మీకు సొంత భూమి ఉంటే పెట్టుబడి మరింత తగ్గుతుంది. ఎందుకంటే మీ భూమిలోనే ఈ వ్యాపారం ప్రారంభిస్తే భూమి లీజ్ కు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. తక్కువ పెట్టుబడితో ఈ ఫ్లై యాష్ బ్రిక్స్ బిజినెస్ ను ప్రారంభించవచ్చు. దీనికోసం వంద గజాల స్థలంతోపాటు కనీసం రూ. 2లక్షల పెట్టుబడి పెట్టాలి.
దీంతో మీరు ప్రతినెలా 1లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ యుగంలో బిల్డర్లు ఫ్లై యాష్ తో చేసిన ఇటుకలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీంతో వాటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యాపారం మంచి ఎంపికగా చెప్పవచ్చు.
ఈ ఇటుకలను విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడే బూడిద, సిమెంట్, రాతి ధూళి మిశ్రమంతో తయారు చేస్తారు. ఈ వ్యాపారం కోసం మీరు ఎక్కువగా పెట్టుబడి యంత్రాలపై పెట్టాల్సి ఉంటుంది. దీనికి వినియోగించే మాన్యువల్ యంత్రాన్ని సుమారు వంద గజాల స్థలంలో ఉంచవచ్చు.
ఈ యంత్రం ధర రూ. 1.50 లక్షలు ఉంటుంది. ఈ యంత్రం ద్వారా మీరు ఇటుక ఉత్పత్తి కోసం ఐదుగురు లేదా ఆరుగురు వ్యక్తులు అవసరం ఉంటుంది. దీంతో రోజుకు దాదాపు 3వేల ఇటుకలను ఉత్పత్తి చేయవచ్చు. ఒక్కో ఇటుక ధర రూ. 5 నుంచి 10 వరకు ఉంటుంది.
ఈ వ్యాపారంలో ఆటోమేటిక్ మెషీన్లు ఉపయోగిస్తే ఎక్కువ ఉత్పత్తితోపాటు, ఆదాయాన్ని కూడా పొందవచ్చు. అయితే ఈ ఆటోమెటిక్ మిషన్ ధర రూ. 10 నుంచి 12లక్షల వరకు ఉంటుంది. ముడిసరుకు కలపడం నుంచి ఇటుకల తయారీ వరకు అంతా కూడా యంత్రంతోనే జరుగుతాయి.
ఆటోమేటిక్ మెషీన్ తో గంటకు వెయ్యి ఇటుకలను రెడీ చేయవచ్చు. అంటే ఈ యంత్రం సహాయంతో నెలలో మూడు నుంచి నాలుగు లక్షల ఇటుకలను తయారు చేయవచ్చు.
బ్యాంకు నుంచి లోన్ తీసుకుని కూడా ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. దీనికోసం ముందుగా బ్యాంకులను సంప్రదించి లోన్స్ పొందవచ్చు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల నుంచి కూడా రుణాలు తీసుకోవచ్చు.