Business Ideas: ఉదయం 2 గంటలు పనిచేస్తే చాలు నెలకు రూ. 50 వేలు పక్కాగా సంపాదించవచ్చు.!

Sun, 04 Aug 2024-7:39 pm,

Small Business Ideas: ఇప్పటివరకు అతి కొద్ది మంది మాత్రమే చేస్తున్న ఈ బిజినెస్ త్వరలోనే పెద్ద ఎత్తున విస్తరించి అవకాశం ఉంది. ఈ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తద్వారా మీరు అతి తక్కువ కాలంలోనే మంచి సంపాదన పొందే అవకాశం ఉంటుంది.  

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల అవగాహన అనేది పెరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం జీవనశైలిలో వస్తున్న లోపాల వల్ల బిపి, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి వ్యాధులు వస్తున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు చేసుకోవడం అనేది తప్పనిసరి ఇందులో భాగంగా డాక్టర్లు ప్రత్యామ్నాయ ఆహారాన్ని సూచిస్తున్నారు. దీన్నే మీరు వ్యాపార అవకాశం గా మలుచుకోవచ్చు తద్వారా మీకు ప్రతిరోజు స్థిరమైన ఆదాయం లభిస్తుంది.  

ప్రస్తుత కాలంలో వెజిటేరియన్ సలాడ్స్ అదే విధంగా హెర్బల్ జూసులను తాగేందుకు జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మీరు దీన్ని వ్యాపార అవకాశంగా మలుచుకొని ఆయుర్వేదిక్ జ్యూస్ స్టాల్ పెట్టుకుంటే మీకు ప్రతిరోజు మంచి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం మీరు ప్రత్యేకంగా షాపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ సమీపంలో వాకింగ్ జాగింగ్ చేసే ప్రదేశాల్లో ఒక చిన్న ఫుడ్ స్టాల్ పెట్టుకొని లేదా ఫుడ్ ట్రక్ ద్వారా మీరు ఈ జ్యూస్ స్టాల్ నడపవచ్చు. ఉదయం పూట కేవలం రెండు నుంచి మూడు గంటలసేపు కష్టపడితే చాలు మీకు మంచి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.  

ముఖ్యంగా ఈ స్టాల్ కోసం మీరు కొద్ది మొత్తంలో పెట్టుబడి పెడితే సరిపోతుంది. దీంతోపాటు జ్యూసర్ మిక్సీలు అదేవిధంగా కూరగాయలను ముక్కలు చేసే ఇన్ స్టంట్ మెషిన్లను కొనుగోలు చేస్తే సరిపోతుంది. మీరు ఎవరైనా ఒక డైటీషియన్ సలహా తీసుకొని ఈ ఆరోగ్యకరమైన డైట్ మెనూ తయారు చేసుకున్నట్లయితే, మీకు మంచి వ్యాపార అవకాశం అవుతుంది. ఉదాహరణకు మొలకెత్తిన గింజలతో తయారు చేయగలిగే స్నాక్స్, ఆయుర్వేదంలో బీపీ షుగర్ తగ్గించే ఔషధ గుణాలున్న కూరగాయలు, ఆకులు, పండ్లతో జ్యూసులు వంటి పదార్థాలతో మీరు మెనూ తయారు చేసుకున్నట్లయితే మంచి బిజినెస్ అయ్యే అవకాశం ఉంటుంది.   

సాధారణ ఫ్రూట్ జ్యూస్ లు అన్నిచోట్ల లభిస్తాయి. కానీ ఈ ఆయుర్వేదిక్ జ్యూసులు అన్నిచోట్ల లభించవు. వీటిని ఇళ్లల్లో తయారు చేసుకొని తాగాలంటే సమయం దక్కదు. ఉదాహరణకు ప్రతిరోజు ఉసిరికాయలతో చేసిన జ్యూస్ తాగితే రక్తహీనత నుంచి బయట పడవచ్చు. కానీ ప్రతిరోజు ఇంట్లో ఉసిరికాయ జ్యూస్ చేసుకొని తాగడం అనేది కష్టసాధ్యమైన పని. దీన్ని ఆధారంగానే మీకు కస్టమర్లు వస్తారు.వీటితోపాటు హెర్బల్ టీలను కూడా తయారు చేసి అమ్మవచ్చు. ఉదాహరణకు దాల్చిన చెక్క టి, అల్లం టీ, అశ్వగంధ టీ, మందార టీ ఇలా పలు రకాల ఆయుర్వేద ఉత్పత్తులతో తయారు చేసిన టీలను మీరు విక్రయించవచ్చు.

రెగ్యులర్ గా మీకు కస్టమర్లు వస్తున్నట్లయితే, వారికి మెంబర్ షిప్ కార్డులను ఇచ్చి ప్రతి నెల వారికి డిస్కౌంట్లను కూడా ఇవ్వచ్చు. అలాగే మీరు డోర్ డెలివరీ ద్వారా కూడా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారంలో మీరు పెట్టుబడి కేవలం కూరగాయలు ఆకులు ఇతర ఉత్పత్తులపైనే పెట్టాల్సి ఉంటుంది. మీకు సహాయకుడిగా ఒక వ్యక్తిని పెట్టుకుంటే సరిపోతుంది. రోజుకి రెండు నుంచి మూడు గంటల సమయమే కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే మిగతా సమయాల్లో వీటికి అంత డిమాండ్ ఉండదు. దయం పూట మాత్రమే ఈ జ్యూసులకు డిమాండ్ ఉంటుంది. ఆదాయం విషయానికి వస్తే కనీసం  ప్రతిరోజు  మీ పెట్టుబడి పై  50% మార్జిన్ లభిస్తుంది.  లెక్కన రోజుకు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టిన మీకు 2000 రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link