Bussiness Idea: శ్రావణ మాసంలో రూ. 5వేల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే చాలు..నెల తిరిగే లోపు రూ.50 వేలు మీ సొంతం..!!
Best Bussiness Idea: శ్రావణమాసం అంటేనే పూజల మాసం. ఈ మాసంలో ప్రతిరోజూ పూజలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మహిళలు దూరప్రాంతాలకు వెళ్లి షాపింగ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే మీరు మీ ఇంటి వద్ద వరలక్ష్మీ వ్రతానికి సరిపడా సామాన్లను అందుబాటులో వచ్చినట్లయితే, ఈ సీజనల్ వ్యాపారంలో మీరు చక్కటి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారానికి కావలసిన పెట్టుబడి అలాగే సరుకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి..? ఎంత లాభం వస్తుంది..? ఎలాంటి మార్కెటింగ్ స్టేటజి అవలంబించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శ్రావణమాసంలో ఎక్కువగా అమ్ముడు పోయే వస్తువు కొబ్బరికాయ. భగవంతుడికి కొబ్బరికాయ అనేది మన భక్తి పూర్వకంగా సమర్పించే ఒక ముఖ్యమైన ఫలం అని చెప్పవచ్చు. కొబ్బరికాయ కొట్టడం అనేది భక్తులు సెంటిమెంట్ గా భావిస్తారు. కొబ్బరికాయ పగలడాన్ని బట్టి భక్తులు వారి భవిష్యత్తును కూడా నిర్ణయించుకుంటారు.
ఒక కొబ్బరికాయ సరిగ్గా పగిలితే వారికి శుభశకునంగా భావిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు కొబ్బరికాయల బిజినెస్ చేసినట్లయితే శ్రావణ మాసంలో మంచి గిట్టుబాటు అవుతుంది. శ్రావణమాసంలో కొబ్బరికాయల బిజినెస్ చేసేందుకు మీరు ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్లో రిటైల్ షాపుల్లో కొబ్బరికాయ ఒకటి 25 రూపాయల వరకు పలుకుతుంది. కానీ మీరు హోల్ సేల్ మార్కెట్లో కొనుగోలు చేసి ఈ కొబ్బరికాయలను విక్రయించినట్లయితే మీకు మంచి లాభం లభిస్తుంది.
మీరు హోల్ సేల్ మార్కెట్లో కొబ్బరికాయలను కొనుగోలు చేసి మీ ఇంటి వద్ద స్టాల్ ఏర్పాటు చేసి ఈ నెలలో విక్రయించినట్లయితే మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం సమయంలో వరలక్ష్మీదేవి రూపును కూడా కొబ్బరికాయతోనే తయారు చేస్తారు అన్న సంగతి గుర్తించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు కొబ్బరికాయల బిజినెస్ చేసినట్లయితే చాలా మంచిది లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
మీరు హోల్ సేల్ గా కొబ్బరికాయలను తక్కువ ధరకు తెచ్చుకోవాలి అనుకున్నట్లయితే, విజయవాడ మార్కెట్ సరైన ప్లేస్ అని చెప్పుకోవాలి. ఇక్కడ కేవలం 10 రూపాయల నుంచి మీకు కొబ్బరికాయలు లభిస్తాయి. వీటిని మీరు సుమారు రెండు రెట్ల లాభం తో మార్కెట్లో ఒక్కో కాయ అమ్ముకోవచ్చు.
ఈ లెక్కన మీరు ఐదువేల రూపాయల సరుకు తెచ్చుకొని అమ్మినట్లయితే..సుమారు 10 నుంచి 15 వేల రూపాయల వరకు లాభం లభిస్తుంది. దీంతోపాటు పువ్వులు, జాకెట్ పీసులు, గాజులు సహా ఇతర ఉత్పత్తులను విక్రయించినట్లయితే మీకు ఈ సీజన్ లో సుమారు రూ.50 వేల వరకూ సంపాదించవచ్చు.