Business Ideas: ఏడాది పొడవునా డిమాండ్ తగ్గని బిజినెస్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. నెలకు లక్షల్లో ఆదాయం
Small Business Ideas : సిమెంట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కంపెనీలు తమ ఫ్రాంచైజీలను అందిస్తున్నాయి. వీటికి అప్లై చేసుకోవడం ద్వారా మీరు ఫ్రాంచేజీ కింద సిమెంట్ డీలర్ గా మారవచ్చు. సిమెంట్ డీలర్షిప్ తీసుకోవడం ద్వారా మీరు దాదాపు సంవత్సరమంతా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో నిర్మాణరంగం పుంజుకుంది.
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు అన్ని నగరాల్లోనూ పెద్ద మొత్తంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా టైరు 2 సిటీలలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో నిర్మాణ రంగం జోరందుకుంది. దీంతో సిమెంట్ డీలర్ షిప్ తీసుకోవడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిమెంట్ డీలర్ షిప్ పొందడం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్స్ నుంచి మీరు ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. అలాగే మీరు ఈ డీలర్షిప్ పొందడం ద్వారా మంచి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న ప్రదేశంలో షాపు పెట్టి సిమెంటు విక్రయించవచ్చు. సిమెంట్ విక్రయించడానికి ముందు మీరు షాపు ఏర్పాటు చేసుకునే ప్రదేశంలో నిర్మాణ రంగంలో పనులు జరుగుతున్నాయా లేదా అన్నది గమనించాలి.
ఒకవేళ మీ చుట్టుపక్కల కొత్తగా నిర్మిస్తున్న కాలనీ కానీ అపార్ట్మెంట్లు కానీ ఇతర నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్న యాక్టివిటీ కానీ ఉన్నట్లయితే, మీరు సిమెంట్ డీలర్ షిప్ బిజినెస్ తీసుకోవడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
సిమెంట్ డీలర్ షిప్ కోసం మీరు అవసరమైన డాక్యుమెంట్లను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు తీసుకున్న డీలర్షిప్ కలిగి ఉన్న షాపుకు కొద్ది దూరం వరకు ఎలాంటి ఇతర సిమెంట్ డీలర్ షాపులు లేకుండా స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మీకు సేల్స్ పెరుగుతాయి.సిమెంట్ డీలర్ షాపులో సిమెంట్ తో పాటు ఇతర నిర్మాణ రంగానికి సంబంధించిన వస్తువులను అందుబాటులో ఉంచవచ్చు.
ఉదాహరణకు పెయింటింగ్, ఫ్లోరింగ్ టైల్స్ ఇలా అనేక రకాల భవన నిర్మాణానికి సంబంధించిన వస్తువులను అందుబాటులో ఉంచడం ద్వారా మీకు అదనపు ఆదాయం లభిస్తుంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న బ్రాండ్ ఫ్రాంచేసి తీసుకోవడం ద్వారా మీరు మంచి బిజినెస్ పొందే అవకాశం ఉంటుంది.