Kamala Harris: కమలా హ్యారిస్ సొంతూరిలో సంబరాలు, ప్రత్యేక పూజలు
తులసేంద్రపురం ఊర్లోవాళ్లంతా చేతుల్లో కమలా హ్యారిస్ పోస్టర్లు పట్టుకుని ఉన్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటున్నారు. చారిత్రాత్మక సందర్బంపై శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. బాణాసంచా కాల్చి వేడుక జరుపుకున్నారు.
తులసేంద్రపురం ఊరిలో మహిళలు కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడంపై దక్షిణ భారతదేశపు ప్రత్యేక యాగం నిర్వహించారు. కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడమనేది దేశంలోని మహిళలందరికీ గొప్ప విషయమని ఊరి మహిళలంటున్నారు.
కమలా హ్యారిస్ అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షురాలైన తొలి మహిళ...అంతేకాకుండా తొలి శ్వేతేతర, తొలి ఆసియా అమెరికన్ పౌరురాలు కూడా. అధ్యక్షుడి తరువాత రెండవ అత్యున్నత పదవి అమెరికాలో ఇదే.
కమలా హ్యారిస్ తల్లి భారతీయురాలు కాగా..తండ్రి జమైకాకు చెందినవారు. ఇద్దరూ చదువు కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కమలా హ్యారిస్ 5 ఏళ్ల వయస్సులో ఇండియాకు వచ్చారు. ఆ సందర్బంగా తన తాతయ్యతో చెన్నై బీచ్ ( Chennai Beach ) లో తిరిగారు.
కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం ( Kamala Harris oath taking ceremony ) కంటే ముందే తులసేంద్రపురం ( Thulasendrapuram ) గ్రామం సంబరాల్లో మునిగింది. జనం ఆలయానికి చేరుకున్నారు. కమలా హ్యారిస్ విజయం, భారత అమెరికా సంబంధాలు మెరుగుపడాలని ప్రత్యేక పూజలు చేశారు ఊరి ప్రజలు.
తమిళనాడు ( Tamil nadu ) లోని చెన్నై నుంచి దాదాపు 320 కిలోమీటర్లు దక్షిణాన తులసేంద్రపురం ( Kamala Harris ) ఊరుంది. దాదాపు వందేళ్ల క్రితం ఇదే ఊర్లో కమలా హ్యారిస్ తాతయ్య జన్మించారు. ఆ తరువాత కమలా హ్యారిస్ తల్లి కూడా ఇదే ఊరిలో జన్మించారు. ( Kamala Harris native place Thulasendrapuram )