Central Government New Schemes 2024: కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.15 వేల ఆర్థిక సాయం..
కేంద్ర ప్రభుత్వం మహిళలకు సిలై మిషన్ కొనుగోలు చేసేందుకు రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అంతేకాకుండా ఈ సాయం పొందడానికి సిలై మిషన్ పథకానికి అప్లే చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం భారత్‌లోని మహిళలను ప్రోత్సహించేందుకు 2025 సంవత్సరంలో సిలై మిషన్ పథకంలో మార్పులు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా త్వరలోనే ఆర్థిక సాయం కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది.
సిలై మిషన్ పథకంలో భాగంగా ఆర్థిక సాయం పొందడానికి తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.15000 వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. దీంతో పాటు రూ.3 లక్షల వరకు రుణం కూడా లభిస్తుంది.
రూ.3 లక్షలు పొందిన వారు 5% వడ్డీతో పొందవచ్చు. అయితే దీనిని అప్లై చేయాలనుకునే అభ్యర్థులు వయస్సు దాదాపు 18 ఏళ్లు నిండాల్సి ఉంటుంది. అంతేకాకుండా అభ్యర్థి స్త్రీ అయి కూడా ఉండాల్సి ఉంటుంది.
సిలై మిషన్ పథకానికి అప్లై చేసుకోవడానికి తప్పకుండా ఆధార్ కార్డ్ జిరాక్స్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు బ్యాంక్ ఆకౌంట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు కూడా పత్రానికి పెట్టాల్సి ఉంటుంది.