Government New Schemes 2024: 65 కోట్ల మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ పథకం ద్వారా రూ.8 లక్షలు మీ సొంతం!
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం కేవలం మహిళల కోసం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా అందుబాటలోకి తీసుకు వచ్చింది. దీని ద్వారా కొన్ని లక్షల మంది స్వయం ఉపాధిని పొందుతారని కేంద్రం తెలిపింది.
అలాగే ఇప్పటికే నమో డ్రోన్ దీదీ పథకం ప్రకారం, మహిళలకు గరిష్ఠంగా రూ.8 లక్షలను కేంద్రం అందిస్తోంది. మహిళలు ఈ పథకం ద్వార లబ్ధి పొందడానికి ఏయే మర్గదర్శకాలు పాటించాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఈ పథకానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం వివరాల్లోకి వెళితే.. మహిళ సంఘాల్లో ఉండే స్త్రీలు వారికి వారు స్వయంగా కళ్లపై నిలబడేందుకు నమో డ్రోన్ దీదీ పథకం ఏర్పాటు చేశారు. ఈ పథకం ప్రకారం మహిళలు డ్రోన్లు కొనుగోలు చేస్తే దాదాపు 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే ఈ పథకంలో భాగంగా దాదాపు రూ.8 లక్షల వరకు రాయితీ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. పథకం కోసం అప్లై చేసుకునేవారు తప్పకుండా మహిళ సహాయక సంఘాల్లో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనిని అప్లై చేసుకున్న తర్వాత జిల్లా స్థాయి కమిటీలు లబ్ధిదారులను ఎపింక చేస్తాయి.
ఈ పథకానికి అప్లై చేసుకునేవారు రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్‌ను కేంద్ర ఏర్పాటు చేసిన డ్రోన్ దీదీ జిల్లా కమిటీలకు అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి అధికారిక వెబ్‌సైట్‌ను కూడా సందర్శించాల్సి ఉంటుంది.
వచ్చే సంవతర్సలో ఈ డ్రోన్ దీదీ పథకం కింద దాదాపు 15000 మహిళా సంఘాల సభ్యులకు డ్రోన్లు అందిచబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకానికి ఇప్పటికే కేంద్రం దాదాపు రూ.1261 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.