Pooja khedkar: మరో సంచలనం.. పూజా ఖేడ్కర్ ఘటనలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తక్షణం అమల్లోకి వచ్చిన ఆదేశాలు..
మహారాష్ట్ర క్యాడర్ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజాఖేడ్కర్ కు కేంద్రం కోలుకోలేని బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూపీఎస్సీలో అనేక ఫెక్ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాలు చేసినట్లు యూపీఎస్సీ గుర్తించింది. ఆమె సబ్మిట్ చేసిన అనేక సర్టిఫికెట్లు నకిలీవని బైటపడ్డాయి.
అంతేకాకుండా.. దివ్యాంగుల కోటాలో కూడా ఆమె యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినట్లు బైటపడింది.ఈ నేపథ్యంలో యూపీఎస్సీ కొన్నినెలల క్రితం ఆమెను భవిష్యత్తులో సివిల్స్ రాయకుండా డిబార్ చేసింది. కానీ ఆమె మాత్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తనపై యూపీఎస్సీ చర్యలు తీసుకునేందుకు హక్కులేదని, కేవలం.. డీఓపీటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కు మాత్రమే తనపై చర్యలు తీసుకునేందుకు హక్కు ఉందని కూడా తెల్చి చెప్పింది.
ఈ క్రమంలో తాజగా, దీనిపై కేంద్రం సీరియస్ అయినట్లు తెలుస్తుంది. యూపీఎస్సీ.. పూజా ఖేడ్కర్ అక్రమాలు, ఫోర్జరీ డాక్యుమెంట్ లు, ఆమె ట్రైనింగ్ సమయంలో చేసిన తప్పులను యూపీఎస్సీ కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో కేంద్రం పూజా ఖేడ్కర్ పై ఈరోజు (శనివారం) కఠిన చర్యలకు ఉపక్రమించింది.ఈ క్రమంలో కేంద్రం.. 1954 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రూల్స్ ప్రకారం.. ఆమెపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలో కేంద్రం.. ట్రైనీ ఐఏఎస్ ను శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు కూడా వెంటనే అమల్లోకి వస్తాయని కూడా కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఇది పూజాకు కోలుకోలేని దెబ్బగా భావించవచ్చు.
పూజా ఖేడ్కర్ మహారాష్ట్రలోని పూణేకు ట్రైనీ కలెక్టర్ గా వెళ్లారు.. అక్కడ కలెక్టర్ కు మాదిరిగా సదుపాయాలు, సెక్యురిటీలు కావాలని గొడవకుదిగారు. ఏకంగా కలెక్టర్ లేనప్పుడు.. ఆయన గదిలొని ఫర్నీచర్ సైతం..తనరూమ్ లోకి షిప్ట్ చేసుకున్నారు.
ఒక చోరీ విషయంలో పూణేలో.. ఏసీపీ స్థాయి అధికారికి ఒత్తిడి తీసుకొచ్చారు. పూజా ఖేడ్కర్ తల్లి.. అమాయకుల భూములు అక్రమంగా ఆక్రమించి గన్ తో హల్ చల్ చేశారు. మరోవైపు పూజా తండ్రి కూడా గతంలో సివిల్స్ అధికారి.. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలువెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం పూజా కుటుంబమంతా చిక్కుల్లొ పడ్డట్లు తెలుస్తోంది.