World Highest Highway: ప్రపంచంలోనే అతి ఎత్తైన హైవే, 116 అంతస్థుల ఎత్తులో
చైనాలో ఈ వంతెనను కొండపై పర్చుకున్న భారీ డ్రాగన్‌లా నిర్మించారు. ప్రపంచంలోని ఎత్తైన వంతెనల్లో ఇదొకటి.
ఈ మొత్తం హైవేలో అద్భుతమంటే మూడంతస్తుల గోళాకారంలోని లూప్ బ్రిజ్. ఇది జపాన్‌కు చెందిన కావాజూ నానాదారు లూప్ బ్రిజ్‌లా 350 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
ఈ హైవే ప్రారంభం నుంచి తుది వరకూ ఎత్తు భూమి కంటే 350 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మీకు సులభంగా అర్ధం కావాలంటే 116 అంతస్థుల కంటే ఎత్తైన హైవే ఇది.
చైనాలో ఆకాశాన్ని అంటుతున్న ఈ హైవే నిర్మాణం 2018 మార్చ్ నెలలో ప్రారంభైంది. 2019 మేలో రాకపోకలు ప్రారంభమయ్యాయి.
ఈ హైవే చూసేందుకు కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ రోడ్డు పొడుగు 30 కిలోమీటర్లు. ఈ హైవేపై 4 వంతెనలు, ఒక సొరంగం ఉంది.
ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించే హైవే ఇది. తియాన్ లాంగ్షాన్ పర్వతంపై నిర్మించిన ఎక్స్‌ప్రెస్ వే ఇది. ఈ హైవే ఎత్తు సముద్రమట్టానికి 1.364 మీటర్లు అంటే 4,475 అడుగుల ఎత్తులో ఉంది.