Cholesterol Cut Fishes: ఈ చేప తింటే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ జాడే ఉండదు..!
ట్యూనా చేపలు.. ట్యూనా చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ట్యూనా ఫిష్‌లో మన శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను పారదోలే శక్తి ఉంటుంది.
ట్రౌట్ ఫిష్.. ఈ చేపలతో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి సహాయపడతాయి.
హెర్రింగ్ ఫిష్.. ఈ చేప మన శరీరానికి కావాల్సిన రెండు రకాల ఫ్యాటీ యాసిడ్స్ EPA, DHA ను అందిస్తుంది. ఇది వాపు సమస్యను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుచేస్తుంది. హెర్రింగ్ చేపల్లో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది.
మెకెరల్ ఫిష్.. మెకెరల్ చేపలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపించేస్తుంది. ఈ మెకరల్ చేపను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇష్టంగా కూడా తింటారు.
సార్డైన్.. సార్డైన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అద్భుతంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడుతుంది. సార్డైన్ చేపలతో ఐరన్, సెలీనియం, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియ వంటి ఖనిజాలు ఉంటాయి. సార్డైన్ చేపలతో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది.
స్వార్డ్ ఫిష్.. ఈ చేపల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. స్వార్డ్ చేప రక్తపోటును సమర్థవంతంగా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ స్థాయిలను బయటకు తరిమేస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )