Christmas gift ideas 2024: క్రిస్మస్ పండగ వేళ మీ వాళ్లను సర్ ప్రైజ్ చేయాలనుకుంటున్నారా..?.. ఈ గిఫ్ట్ ఐడియాస్ మీ కోసం..
ప్రస్తుతం చాలా మంది ఒక వైపు క్రిస్టమస్ , మరొవైపు నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. తమ ఫ్రెండ్స్, ఫ్యామీలీతో ఈ పండుగల వేళ అనేక ప్లాన్ లు చేసుకుంటున్నారంట.
క్రిస్మస్ పండుగను క్రిస్టియన్లు ఎంతో పండుగ మాదిరిగి జరుపుకుంటారు. అదే విధంగా.. ఈ రోజున ముఖ్యంగా.. డిసెంబరు 25 అందరు కూడా తమ ఇంటి ముందు తప్పనిసరిగా క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటారు. అంతే కాకుండా రంగు రంగుల లైట్లతో ఇంటిని డెకోరేట్ చేస్తుంటారు.
క్రిస్మస్ వచ్చిందంటే చాలు.. చాలా మంది శాంటా క్లాజ్ లను గిఫ్ట్ లుగా ఇస్తుంటారు. అయితే.. ఈసారి మీ ప్రియమైన వాళ్లకు ఏ గిప్ట్ లు ఇస్తే సర్ ప్రైజ్ అవుతారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం వింటర్ సీజన్ నడుస్తొంది. మంచి హుడీ ని మీ వాళ్లకు గిఫ్ట్ గా ఇస్తే హ్యపీగా ఫీలవుతారు.
అదే విధంగా.. స్మార్ట్ వాచ్, షూస్ లు, ఇయర్ ఫోన్స్, మ్యూజిక్ బాక్స్, జేబీఎల్ మొదలైనవి ఇస్తే ఫుల్ ఖుషీ అవుతారు. దీనితో పాటు అమ్మాయిలకైతే.. మేకప్ కిట్ లు, ఏదైన వారికి ఇష్టమైన డ్రెస్ లను ఇస్తే సర్ ప్రైజ్ గా ఫీలవుతారు.
ఒకవేళ చాలా దగ్గర వాళ్లు అయితే.. ఎమోషనల్ , లవర్స్ అయితే.. వాళ్లకు గోల్డ్ రింగ్ లేదా సిల్వర్ బ్రాస్లెట్ లు కూడా ప్లాన్ చేసుకుంటూ బాగుంటుంది. చిన్న పిల్లలకు.. స్కూల్ బుక్స్ లేదా శాంటా క్లాజ్ ఆర్టీఫిషీయల్ ట్రీ, కేక్ లు ఆర్డర్ పెడితే కూడా మీ వాళ్లు సర్ ప్రైజ్ గా ఫీలవుతారు.
దీనితో పాటు ట్రావెల్స్ బ్యాగ్, ఫర్నీచర్ లేదా పర్ ఫ్యూమ్ లు ఇలా కొత్తవి ఏదైన ట్రై చేస్తే మీకు ఇష్టమైన వాళ్లు పండుగ చేసుకుంటారు. మనం ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ వారికి ఎల్లకాలం కూడా గుర్తుండిపోతుంది. అందుకే చాలా మంది ఏదో ఒక గిఫ్ట్ ను తప్పనిసరిగా తమ వాళ్లకు ఇచ్చి జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ లు చేస్తారు.