Telangana: రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రిలిమ్స్ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..
సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నవారికి ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రిలిమ్స్ పాసైతే రూ. లక్ష రూపాయాలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. యూపీఎస్సీ సివిల్ సర్సీస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జరిగిన సివిల్స్ ప్రలిమ్స్ పాసైన వారు ఈ పథకానికి అర్హులు.
ఈ పథకాన్ని ప్రజాభవన్ వేదికగా ప్రారంభించారు. పోటీ పరీక్షల్లో సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.
అర్హత గల అభ్యర్థులు సులభంగా అప్లై చేసుకోవడానికి ఈ అభయహస్తం పథకాన్ని విడుదల చేశారు. సివిల్ సర్వీస్ ప్రిలిమరీ ఎగ్జామినేషన్‌కు దాదాపు 50 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి ఏడాది దాదాపు 500 మంది ప్రిలిమ్స్ పాసవుతున్నారు.
అర్హత.. తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటా కలిగి ఉండాలి
యూపీఎస్‌సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాసై ఉండాలి. కుటుంబ ఆదాయం రూ. 8 లక్షలు మించకూడదు. వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు
మూడు నెలల్లో 30,000 ఉద్యోగాల భర్తీ చేపట్టామని సీఎం అన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నారు. వారి బాధలను అర్థం చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా పోస్ట్‌పోన్ చేశామన్నారు