Cold Moon 2020 Date And Timings: అరుదైన ఫుల్ మూన్ 2020.. కనువిందు చేయనున్న చందమామ
ఈ 2020 ఏడాది ముగిసేలోగా మరోసారి పూర్ణ చంద్రుడు (Cold Moon 2020) దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే ఎన్నో ఫుల్ మూన్ చూశాం ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా. తాజాగా రానున్నది ఈ ఏడాది ఆకాశంలో కనువిందు చేయనున్న చివరి పూర్ణ చంద్రుడు. దీన్ని డిసెంబర్ ఫుల్ మూన్ (Full Moon Of December), కోల్డ్ మూన్ అని కూడా పిలుస్తారు. (Image: NASA)
Also Read: Jupiter-Saturn Great Conjunction: 800 ఏళ్ల తర్వాత ఖగోళంలో అద్భుతం..
క్రిస్మస్ స్టార్‌ను వీక్షించిన తర్వాత ప్రపంచమంతా వీక్షించనున్న పూర్ణ చంద్రుడు త్వరలో దర్శనమివ్వనున్నాడు. డిసెంబర్ 29, 30లలో రెండు రోజులపాటు ఫుల్ మూన్ కనువిందు చేయనుంది. ప్రస్తుతం వచ్చే ఫుల్ మూన్ అత్యంత చల్లని సమయంలో వస్తుంది కనుక దీన్ని కోల్డ్ మూన్ 2020 అని వ్యవహరిస్తారు. పగటి కన్నా రాత్రి సమయం అధికంగా ఉంటుంది.
ఈ ఏడాది కనువిందు చేయనున్న 13వ పూర్ణ చంద్రుడు ఇది. డిసెంబర్ 29న రాత్రి ఈ కోల్డ్ మూన్ లేక ఫుల్ మూన్ వీక్షించవచ్చు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సంపూర్ణంగా ఫుల్ మూన్ కనువిందు చేస్తుంది. (Photo: Twitter/@nasa)
Also Read: Zodiac Signs Affected With Solar Eclipse 2020: ఈ రాశులవారిపై సూర్యగ్రహణం అధిక ప్రభావం!
భారత్‌లో డిసెంబర్ 29న కనిపిచినా.. పూర్తిగా అయితే మాత్రం డిసెంబర్ 30న పూర్ణ చందమామ (Cold Moon 2020) దర్శనమిస్తుంది. ఫుల్ మూన్ వీక్షించేందుకు భారత్‌లో అయితే రాత్రి 8:58గంటలు మంచి సమయమని ఖగోళ నిపుణులు సూచిస్తున్నారు. (File photo: Getty)
చివరి ఫుల్ మూన్ చలి కాలంలో వస్తుంది కనుక ప్రజలు దీన్ని వీక్షించేందుకు చాలా ఆసక్తి కనబరుస్తారు. అందులోనూ రాత్రివేళ అధికంగా ఉంటే శీతాకాలంలో ఏర్పడే ఈ ఫుల్ మూన్‌ను కోల్డ్ మూన్ అని అందుకే పిలుస్తారు. మంగళవారం చూడకపోయినా, బుధవారం రోజు కచ్చితంగా ఆరెంజ్ కలర్‌లో దర్శనమిచ్చే బ్లూ మూన్ చూసి తీరాల్సిందే మరి.
Also Read: Solar Eclipse 2020 Date and Timings: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం