Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా..? ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ప్రతి నెలా క్రెడిట్ కార్డు బిల్లును పూర్తిగా చెల్లించండి. గడువు తేదీ ముగిసినా మీరు చెల్లించకపోతే.. భారీ జరిమానాలు ఉంటాయి. చివరి తేదీ వరకు ఆగకుండా ముందే బిల్లును చెల్లించండి.
మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ కంటే ఎక్కువ అస్సలు ఖర్చు చేయకండి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో 20 నుంచి 30 శాతం మాత్రమే ఖర్చు చేసేలా చూసుకోండి. వృథా ఖర్చులు నివారించడంతో పాటు బిల్లు చెల్లించేందుకు సులభంగా ఉంటుంది.
క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఉన్న చోటు ఉపయోగించండి. ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డు ద్వారా నగదు విత్ డ్రా చేయకండి.
మీ బిల్లులను చెల్లించడానికి ఆటోపేలో సెట్ చేసుకోండి. మీరు లాస్ట్ డేట్ మర్చిపోయినా.. ఆటో పే ద్వారా మీ బిల్లులు సకాలంలో చెల్లించవచ్చు. పెనాల్టీ నుంచి తప్పించుకుంటారు.
నెల ప్రారంభంలో మీ ఖర్చులను అంచనా వేసుకోండి. మీరు ఏ పని కోసం ఎంత ఖర్చు చేయాలో రాసిపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏ పనికి ఎంత ఖర్చు పెట్టాలనే ఆలోచన వస్తుంది. దీనివల్ల పొదుపు కూడా ఉంటుంది. క్రెడిట్ కార్డును అనవసరమైన చోట వాడకండి.