Health Benefits Of Curry Leaves: కరివేపాకుతో షుగర్ కంట్రోల్, గర్భిణులకు మేలు సహా ఎన్నో ప్రయోజనాలు
Health Benefits Of Curry Leaves: కరివేపాకును వంటల్లో రుచి, ఫ్లేవర్ కోసం వాడుతుంటాం. కానీ కొందరు వంట పూర్తయ్యాక కరివేపాకును తినడకుండా ఏరి వేస్తుంటారు. కరివేపాకు రెగ్యూలర్‌గా తింటే బాడీ డిటాక్స్ అవుతుంది. కరివేపాకు తినడం, కరివేపాకు జ్యూస్ తాగడం చేస్తే అజీర్తి సమస్య దూరం చేస్తుంది. కరివేపాకు తినడం ఇబ్బందిగా ఉంటే జ్యూస్ చేసుకుని తాగడం మంచిది. దీనివల్ల పోషకాలు, విటమిన్లు సులువుగా రక్తంలోకి చేరతాయి.
కరివేపాకు రెగ్యూలర్‌గా తింటే షుగర్ కంట్రోల్ (మధుమేహం) అవుతుంది. కరివేపాకు(Curry Leaves)లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిండి పదార్ధాలను గ్లూకోజ్‌గా మార్చడాన్ని నివారించడంలోనూ సహాయపడతాయి, తద్వారా రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. కనుక కరివేపాకు తింటే మీ ఆరోగ్యానికి ప్లస్ పాయింట్ అవుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు జ్యూస్ (Curry Leaves Juice) తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అందుకు తగ్గ శారీరక శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది.
కరివేపాకు తినడం, కరివేపాకు జ్యూస్ తాగడం చేస్తే అజీర్తి సమస్య దూరం చేస్తుంది. కరివేపాకు రెగ్యూలర్‌గా తింటే బాడీ డిటాక్స్ అవుతుంది. శరీరంలో విష పదార్థాలను నాశనం చేస్తుంది.
Also Read : Health Benefits Of Bitter Gourd: ఈ ప్రయోజనాలు తెలిస్తే కాకరకాయ కచ్చితంగా తింటారు
కరివేపాకు గర్భిణులకు మేలు చేస్తుంది. గర్భిణీలకు తరచుగా అయ్యే వాంతులను నియంత్రించడంతో పాటు వికారం, అసౌకర్యం కలగడాన్ని కరివేపాకు తగ్గిస్తుంది. వాంతులు, వికారం లక్షణాలను నియంత్రించడానికి జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని కరివేపాకు ప్రేరేపిస్తుంది.
Also Read : Health Benifits Of Lemon: నిమ్మరసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరల ప్రాముఖ్యాన్ని డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా కంటి చూపు కోసం ఆకూకూరలు తీసుకోవడం ఉత్తమమని అందరికీ తెలిసిందే. కరివేపాకు సైతం కంటిచూపు తగ్గకుండా ఉండేలా చేస్తుంది. వెంట్రుకలు తెల్లగా అవుతున్నాయని బాధపడేవారు తరచుగా కరివేపాకు తింటే ప్రభావం చూపుతుంది.
Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!