Wife On Rent: అంగట్లో బొమ్మలు.. ఈ ఆడోళ్లు.. రూ. 10 భార్యలను అద్దెకు ఇస్తారు.. మన దేశంలోనే ఎక్కడో తెలుసా?

Sat, 04 May 2024-12:00 pm,

ఇప్పటి వరకు మనం కేవలం ఇల్లు, కారు, బైక్‌ అద్దెకు ఇవ్వడం చూశాం. కానీ, మీరెప్పుడైనా భార్యను అద్దెకు ఇవ్వడం చూశారా? కానీ, ఇది నిజం, ఎక్కడో కాదు.. మన దేశంలోనే జరుగుతుంది. రూ. 10 కోసం భార్యను ఇతర మగవారికి అప్పజెప్పే సంస్కృతి కొనసాగుతుంది. సాధారణంగా భార్యాభర్తలు అంటేనే ఒకరికి ఒకరు కలకాలం కలిసి ఉండాలి అంటారు. మన భారతీయ సంప్రదాయంలో భార్యభర్తల సంబంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పెళ్లిళ్లు కూడా ఈ ప్రపంచంలోనే ఎంతో విశేషంగా మన దేశంలోనే చేసుకుంటారు. అయితే, అక్షరాస్యత లేమి కారణంగా భార్యలను ఇతర మగవారికి అద్దెకు ఇస్తున్నారు కొన్ని తెగలకు చెందిన వ్యక్తులు.   

భార్యలను ఇలా మరొక మగవాడికి అప్పజెప్పుతున్న వైనం మధ్యప్రదేశ్‌లోని శివపురిలో జరుగుతోంది. ఈ సంప్రదాయాన్ని వాళ్లు దాడిచ్చ అని పిలుస్తున్నారు. దీని ప్రకారం ఆడవాళ్లు రూ. 10 నుంచి లక్ష రూపాయల వరకు కూడా వారి రేటు పలుకుతుంది. ఆకాశంలో సగం అంటూ, మగవాళ్లకు ధీటుగా అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్న ఆడవాళ్లను ఇలా అమానుషంగా అంగట్లో పెడుతున్నారు. ఒక్కరోజు రెండు రోజులు కాదు ఇక్కడ ఏడాదిపాటు కూడా భార్యను అద్దెకు ఇస్తున్నారట. ఇది ఓ ఆచారం అంటున్నారు.  

ఈ ఆచారం వారు కేవలం నోటి మాట ద్వారా జరపడం లేదు. ఓ అగ్రిమెంట్‌ కూడా రాసుకుంటారు. తమ భార్యలను ఎన్ని రోజులకు అద్దెకు ఇవ్వాలో ఎంత రేటు పలుకుతుందో ఇవన్ని రాసుకుంటారు. ముందుగానే రెండు పార్టీలు ఈ ఒప్పందానికి వస్తారు. భర్త చెప్పినట్లుగా భార్య తనను అద్దెకు తీసుకునే వద్దకు వెళ్లాలి, భర్త మాదిరి వారిని కూడా ప్రేమగా చూసుకోవాలి. కొందరైతే పిల్లల్ని సైతం కంటున్నారు. ఇక్కడ ప్రధానంగా పెళ్లి కానీ, అమ్మాయిలకు గిరాకీ ఎక్కువ, కాస్త అందంగా రంగు తేలి ఉండి కన్య కూడా అయితే, లక్షలు పెట్టి వీరిని కొనుగోలు చేస్తున్నారట. ఇక పెళ్లైన ఆడవారికి గిరాకి తక్కువ రోజుకు రూ. 10 నుంచి అద్దెకు పెడతారట.  

భార్య ఎంత అందంగా ఉంటే అంత రేటు వస్తుంది. ఎంత చిన్న వయస్సు ఉంటే అంత ఎక్కువ డబ్బు ఇచ్చి కొనుగోలు చేస్తారు. ఆ ప్రాంతంలోని డబ్బున్నవారు వారికి పెళ్లి ఆలస్యం అయినా ఇలా వీరి భార్యలను అద్దెకు తీసుకుంటారు. ఒప్పందం అయిపోయిన తర్వాత వేరొక వ్యక్తికి భార్యను అద్దెకు పెడతారు. లేదా ఆ పాత వ్యక్తి మళ్లీ ఒప్పందం రెనివల్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.  

అయితే, ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు భార్యలకు ఉంటుంది. కానీ, అంత ఈజీ కాదు అప్పటి వరకు చెల్లించినా అద్దెను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు ఇష్టం లేకున్నా ఈ పనులు చేయాల్సి వస్తోంది. బతిమాలో భయపెట్టో ఈ పనులకు ఒప్పిస్తున్నారు. ఈ మార్కెట్లో పదేళ్ల వయస్సు నుంచే పిల్లలను అద్దెకు విక్రయించే సంస్కృతి కొనసాగుతోందట.   

మహిళలను వీరి సంప్రదాయంలో ఓ ఆస్తిగా పరగణిస్తారు. అంతేకాదు కొనుగోలు చేస్తున్న ధనవంతులు కూడా సంతలో పశువులను కొనుగోలు చేస్తున్నట్లు ఇక్కడ అమ్మాయిలను కొనుగోలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. జీవితాంతం ఒకే భార్యతో ఉండాల్సిన పనిలేదు. వారి గడువు తీరిన తర్వాత మరో కొత్త అమ్మాయిని అద్దెకు తీసుకోవచ్చు.  చదువుకున్న వారు కూడా ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది కేవలం మధ్యప్రదేశ్‌కే పరిమితం కాలేదు. హిరియాణ, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లోని తెగలు కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఏ కేసు కూడా నమోదు కాలేదు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link