Deepika padukone: 20 నిముషాల్లో అమ్ముడు పోయిన దీపికా పదుకొనే గౌను.. ఆ డబ్బులతో ఏంచేస్తుందో తెలుసా..?
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల నటి దీపికా.. బ్యూటీ బ్రాండ్ 82°E ఈవెంట్లో పసుపు రంగు మెటర్నిటీ గౌను ధరించి పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ గౌనును ఆన్ లైన్ లో వేలాటికి పెట్టారు.
అయితే.. దీపికా వేలంలో పెట్టిన పసుపు రంగు గౌను కేవలం ఇరవై నిముషాల్లోనే, ఆన్ లైన్ లో మరోకరు వేలంపాట పాడి మరీ దక్కించుకున్నారు. దీని కోసం చాలా మంది పోటా పోటీగా ఆన్ లైన్ లో వేలంలో పాల్గొన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో.. దీపిక గౌనును నైనిక అనే డిజైనర్ స్పెషల్ గా తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ గౌను ను నటి దీపికా పదుకొన్ దగ్గరుండి మరీ ఇష్టంతో చేయించుకున్నారంట.
దీపికా తన ఇన్ స్టా వేదికగా పసుపు రంగు గౌను వేలానికి పెట్టినట్లు స్వయంగా వెల్లడించారు. అంతే కాకుండా.. కేవలం 20 నిముషాల్లోనే దీన్ని రూ. 34,000కి వేలంపాట పాడి మరీ అమ్ముడుపోయిందని చెప్పారు. దీని ద్వారా వచ్చిన ఆదాయంను ఒక మంచి పనికి ఉపయోగిస్తున్నట్లు ఈ బాలీవుడ్ బామ తెలిపారు.
నటి తన వ్యక్తిగత వెబ్సైట్లో ఫ్రెష్ ఆఫ్ ది ర్యాక్ సెగ్మెంట్ రూపంలో ఛారిటీ సేల్‌ను నిర్వహించింది. చారిటీ సేల్ కోసం కొన్ని రోజులుగా తను వేసుకున్న పసుపు రంగు గౌనునే క్లోసెట్లో ఉంచింది. దీన్ని కొనడానికి ఎక్కువ మంది పోటీ పడినట్లు తెలుస్తోంది.
కేవలం.. 20 నిమిషాల్లోనే గౌను అమ్ముడుపోయిందని ఆమె బృందం పేర్కొంది. ఇక దీని ద్వారా వచ్చిన డబ్బులు తాము చారీటీ కోసం ఉపయోగిస్తున్నట్లు ఆమె వ్యక్తిగత సభ్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. దీపిక తన పసుపు రంగు గౌనులో ఉన్న చిత్రాలను తన ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. ఈ యేల్లో రంగు గౌను బాగుందంటూ బాలీవుట్ నటీ నటులు ఆమెకు లైక్ లు, హర్ట్ ఎమోజీలతో ప్రశసించారు. మరోవైపు బాలీవుడ్ నటి మంచి మనస్సు చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవున్నారు.