Holiday: వావ్.. మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. నవంబర్ 7న పబ్లిక్ హలీడే.. కారణం ఏంటో తెలుసా..?
ప్రస్తుతం దేశంలో కార్తీక మాసం ప్రారంభమైంది. అంతే కాకుండా.. ఇటీవల దీపావళి పండుగను కూడా ప్రజలంతా ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నట్లు తెలుస్తొంది. దీపావళిని ఐదు రోజుల పాటు ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
ఈ నేపథ్యంలో చాలా మంది ఇంకా తమ గ్రామాలలోనే ఫ్యామిలీస్ తో కలిసి దీపావళి వేడుకల్లో ఉన్నారగా సమాచారం. అయితే.. టపాకాయల వల్ల ఈ సారి కూడా రికార్డు స్థాయిలో గాలిలో కాలుష్యం పెరిగిపోయిందని తెలుస్తొంది.
దీని వల్ల సగటు మనిషీతీసుకునే ఆక్సిజన్ పరిణామం క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తొంది. అయితే.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం వాయుకాలుష్యం గణనీయంగా తగ్గిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎంగా అతీషీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
అయితే.. ప్రస్తుతం ఉత్తరాదిన రాష్ట్రాలు నవంబర్ 7 ఛత్ పూజను ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈరోజున ప్రత్యేకంగా గంగా స్నానం చేస్తుంటారు. సూర్యుడ్నికి పూజలు చేస్తారు. ఈ రోజున సెలవు ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి అనేక రిక్వెస్ట్ లు వచ్చినట్లు తెలుస్తొంది.
దీంతో అతీషీ సర్కారు అనూహ్యంగా నవంబరు 7న పబ్లిక్ హలీడేగా ప్రకటిస్తూ కూడా.. ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ స్కూళ్లు , కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు హలీడే ఉన్నట్లు తెలుస్తొంది. అక్కడి ప్రజలు ఈరోజున గంగానదికి వెళ్లి సూర్యుడ్ని , గంగను పూజిస్తారు . దీనికోసం ప్రభుత్వం కూడా అన్నిరకాలైన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తొంది.
ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది (2025) ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని 'పూర్వాంచలి' ఓటర్లు అనేక స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలరు. ఈ నేపథ్యలో ప్రజల్ని ప్రసన్నం చేసుకునేందుకు.. ఆప్ సర్కార్.. పూర్వాంచలి ఓటర్లకు దగ్గర కావడం కోసం ఛత్ పూజకు పబ్లిక్ హాలీ డే ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.