Delhi Floods Scary Pics: జలదిగ్భంధనంలో దేశ రాజదాని, భయం గొలుపుతున్న వరద దృశ్యాలు
యమునా నది వరద కారణంగా ఢిల్లీ ఎర్రకోట కూడా జలదిగ్బంధనలో చిక్కుకుంది. ఎర్రకోట చుట్టూ వరద నీరే కన్పిస్తోంది.
ఢిల్లీ వరదల కారణంగా ఇప్పుడు తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతోంది. ముఖ్యమైన మూడు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను మూసివేయాల్సి రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
ఢిల్లీ వరద కారణంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మంత్రులు, అధికారుల నివాసాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఢిల్లీ వరద బాధితుల్ని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలకు చెందిన 12 బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ప్రస్తుతం వరద నీటి మట్టం తగ్గుతున్నట్టు సమాచారం.
ఉత్తరాదిలోని కొండ ప్రాంతాల్లో, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గత 4-5 రోజుల్నించి భారీ వర్షాలు కురుస్తుండటంతో యుమునా నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి.
యమునా నది పెరుగుతున్న నీటిమట్టం కారమంగా ఢిల్లీలో స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. ఆదివారం వరకూ సెలవులు ప్రకటించారు.
దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది వరద కారణంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. హర్యానాలోని హత్నికుడ్ బ్యారేజ్ నుంచి విడుదలైన వరద నీటితో యమునా నది నీటిమట్టం మరింతగా పెరిగిపోయింది.