Hyderabad Real Estate: హైదరాబాద్‎లో ఇల్లు కావాలంటే..ఈ ప్రాంతాల్లో చాలా చౌక.. అద్దెను ఈఎంఐగా చెల్లిస్తే చాలు

Mon, 16 Dec 2024-1:14 pm,

Hyderabad Real Estate: భూముల ధరలకు రెక్కలు రావడం, నిర్మాణ సామాగ్రి ధరలు భారీగా పెరగడం, కార్మికుల వేతనాలు భారమవ్వడం..ఇలాంటి కారణాలతో సామాన్యులకు హైదరాబాద్ లో సొంత ఇల్లు అనేది అందనంత దూరంలో ఉంటోంది. రెండు మూడేళ్లక్రితం వరకు కూడా దేశంలో ఇతర మెట్రో  నగరాలతో పోల్చితే హైదరాబాద్ లోనే ఇండ్ల ధరలు అందుబాటులో ధరలోనే ఉంది. కానీ ఇప్పుడు హైరైజ్ అపార్ట్ మెంట్స్, లేటెస్ట్ టెక్నాలజితో వసతుల కల్పనతో కూడిన లగ్జరీ హోమ్స్ నిర్మాణంలో బిల్డర్లు పోటీ పడుతుండటంతో కోట్లు వెచ్చిస్తే కానీ సొంతింటి కల నెరవేరడటం లేదు.   

అయితే డబుల్ బెడ్ రూమ్, కిచెన్, హాల్ అటాచ్డ్ బాత్రూమ్స్ తో 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే బడ్జెట్ ఇల్లకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. చిన్న వ్యాపారులు, సూపర్ వైజర్లు, డ్రైవర్లు, మధ్యస్థాయి ఉద్యోగులు వంటి సామాన్య, మధ్యతరగతి వర్గాలు సొంతింటి కలను బడ్జెట్ హోమ్స్ తో తీర్చుకుంటున్నారు. 

అద్దెకు ఉండే బదులు అద్దెకు చెల్లించే డబ్బులతో నెలలవారీ ఈఎంఐ రూపంలో చెల్లిస్తే సెంథిల్లు సాధ్యం అవుతుందనేది వారి ఆలోచన. దీంతో రూ. 50లక్షలలోపు ధర ఉండే ఇళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది.   

మాదాపూర్, నార్సింగి, నానక్ రాం గూడ, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్ మినహా మిగిలిన మూడు జోన్లలో ఇప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు రూ. 50లక్షలలోపు ఉండే ఇండ్లు దొరుకుతున్నాయి. ఇబ్రహీంపట్నం, నాగార్జున్ సాగర్ రోడ్డు, హయత్ నగర్, పోచారం, ఘట్కేసర్, కీసర, శామీర్ పేట వంటి ప్రాంతాల్లో బడ్జెట్ ఇండ్లను కొనుగోలు చేయవచ్చు. 

ఔటర్ లోపల ఉండే నివాస ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో తీసుకోవడం మంచిది. వీటిల్లో క్లబ్ హౌస్, వాకింగ్, ట్రాక్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటివి ఉండేవిధంగా చూసుకోవలె. దీంతో ఇల్లు చిన్నగా అనిపించినా చుట్టూ మంచి వాతావరణం ఉంటుంది.   

ఇండ్లు కొనుగోలు ముందు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి విభాగాల నుంచి నిర్మాణ అనుమతులతోపాటు రెరా రిజిస్ట్రేషన్ ఉన్నప్రాజెక్టుల్లోనే కొనుగోలు చేయాలి. బిల్డర్ల చరిత్ర కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link