Pawan Kalyan: పాలనలో పవన్ మార్క్.. స్పాట్‌లో సొల్యూషన్.. డిప్యూటీ సీఎంకు నెటిజన్లు సెల్యూట్

Sat, 22 Jun 2024-7:57 pm,

మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర రోడ్డుపైనే ఉపముఖ్యమంత్రి పవన్  కళ్యాణ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ ఆఫీసుకు వచ్చిన పవన్‌ కలిసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.   

దీంతో కాన్వాయిను నిలిపివేసి.. ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకుని ప్రజలతో మాట్లాడారు. వాళ్ల వినతులు స్వీకరించి.. సమస్యలపై అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడారు.   

ఈ సందర్భంగా భీమవరానికి చెందిన  శివకుమారి అనే మహిళ విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని.. ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని పవన్‌కు చెప్పారు. గత 9 నెలలుగా ఆమె ఎక్కడ ఉందో తెలియదని కన్నీటిపర్యాంతం అయ్యారు.   

మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని.. తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని పరిశీలించిన పవన్ కళ్యాణ్.. వెంటనే మాచవరం సీఐకు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు.   

వెంటనే చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. బాధితులు, పార్టీ నాయకులను ఆఫీస్ వాహనంలోనే మాచవరం పీఎస్‌కు పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. సెల్యూట్ డిప్యూటీ సీఎం సార్ అంటూ నెటిజన్లు, పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link