Detox Drinks: ఈ 4 డిటాక్స్ డ్రింక్స్ తాగితే ఢిల్లీ కాలుష్యంలో కూడా మీ ఊపిరితిత్తులు హెల్తీగా ఉంటాయి..
ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని రకాల డీటాక్స్ డ్రింక్స్ ఉన్నాయి. వీటితో ఊపిరితిత్తులు సేఫ్ గా ఉంటాయి. వాతావరణంలో మార్పులు, కాలుష్యం వల్ల మన శరీరంలోకి టాక్సిన్స్ చేరి ఇన్ఫెక్షన్లను సోకేలా చేస్తుంది. దీంతో ఇతర ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అయితే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతో టాక్సిన్స్ తొలగించే డిటాక్స్ డ్రింక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
పసుపు, అల్లం టీ.. పసుపులో కర్కూమిన్ ఉంటుంది ఇది మీ ఊపిరితిత్తులను క్లెన్స్ చేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేషన్ గుణాలు కలిగి ఉంటాయి. పసుపు, అల్లం కలిపి తీసుకోవటం వల్ల ఊపిరితులు క్లీన్ అయిపోతాయి. ఆరోగ్యానికి ఎంతో గాను తోడ్పడుతుంది. పసుపు, అల్లం నిత్యం గదిలో అందుబాటులో ఉంటుంది. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎంతటి కాలుష్యంతో అయినా పోరాడవచ్చు.
కలబంద జ్యూస్.. కలబంద జ్యూస్ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మంచి డిటాక్స్ డ్రింక్‌లా పనిచేస్తుంది. కలబంద జ్యూస్ లంగ్స్‌ను శుభ్రం చేస్తాయి. కలబందలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కలబందలో ఇమ్యూనిటీ బూస్ట్ చేసే గుణాలు కలిగి ఉంటాయి. రొంప సమస్యలు రాకుండా కాపాడుతుంది. దీంతో మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి కలబందను ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఉపయోగిస్తారు. మన బ్యూటీ రొటీన్‌లో ఉపయోగించడం వల్ల జుట్టు, చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి. కలబందను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఆకుకూరల జ్యూస్.. ఆకుకూరలతో తయారుచేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా మీ ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది దీంతో మంట సమస్య తగ్గిపోయి శరీరంలో విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఆకు కూరల జ్యూస్ ముఖ్యంగా పాలకూర, కాలే వంటివి డైట్లో చేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు పండ్లు రకరకాల కూరగాయలు కూడా ఉన్నాయి వీటిని డైట్ లో చేర్చుకోవాలి.
లెమన్ డిటాక్స్ డ్రింక్.. చాలామంది ఉదయం లెమన్ టీతో స్టార్ట్ చేస్తారు. లెమన్ చర్మాన్ని, జుట్టుకు మాత్రమే కాదు మన శరీర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది శరీర పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణ క్రియను మెరుగు చేస్తుంది. ఇవి ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. రొంప సమస్యలు మీ దరిచేరవు. లెమన్లు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.