Kubera Yogam: 62 ఏళ్ల తర్వాత ధనత్రయోదశి వేళ కుబేర యోగం.. ఈ రాశులకు లగ్జరీ లైఫ్‌తో పాటు, అఖండ ధనయోగం..
దీపావళి పండుగను చాలా మంది ఎంతో వేడుకగా జరుపుకుంటారు.ఈ వేడుకను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, అమావాస్య ఇదే రోజున దీపావళిని జరుపుకుంటారు.
నరక చతుర్దశి రోజున నరకుడిని సత్యభామ సంహారించి, లోకాలను అసురుల బారి నుంచి కాపాడారని చెప్తుంటారు. అందుకే ఈ రోజున దీపాలు వెలిగించి లక్ష్మీదేవీ పూజలు చేస్తుంటారు. ఈరోజున ఏపనిచేసిన కూడా విజయాలను సిద్దింప చేస్తుందని చెబుతుంటారు.
ధన త్రయోదశిని, నరక చతుర్దశి, దీపావళిని వరుసగా.. అంటే.. 30,31, నవంబరు 1 వ తేదీన జరుపుకోబోతున్నాం.ఈ క్రమంలో ధన త్రయోదశి రోజు అత్యంత అరుదైన కుబేర యోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశులకు అఖండ ధనయోగంతో పాటు, లగ్జరీ జీవితాన్ని కూడా అనుభవించ బోతున్నారు. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..
తుల ఈ రాశి వారికి కుబేర యోగం అఖండ విజయాలను అందిస్తుంది . కోర్టు కేసులో విజయం సాధిస్తారు. సోదరులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారమౌతాయి. రాబడి పెరుగుతుంది.
ధనస్సు..ఈ రాశి వారికి ఈ యోగం లాటరీలను వచ్చేలా చేస్తుందని చెప్పుకొవచ్చు. రియల్ ఎస్టేట్ రంగాలలో రాణిస్తారు. అఖండ ధన ప్రాప్తి కల్గుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
మీనం ఈ రాశి వారికి విదేశీయానానికి అవకాశం ఉందని చెప్పవచ్చు. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. కొత్త ఇల్లు కొనుగోలుకు అవకాశం ఉంది. మీ వద్ద నుంచి డబ్బులు తీసుకున్న వారు మళ్లీ ఇంట్రెస్ట్ తో సహా ఇచ్చేస్తారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)