Lakshmi Narayana Yogam: 82 ఏళ్ల తర్వాత శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశుల వారికి అఖండ ధనయోగంతో పాటు రాజభోగాలు..

Mon, 21 Oct 2024-10:42 am,

దేశంలో ప్రస్తుతం దీపావళి వేడుకకు అన్ని విధాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందు సంప్రదాయంలో దీపావళిని కూడా ఎంతో పవిత్రంగా చేసుకుంటారు. దీపావళిని చాలా చోట్ల మూడు  రోజుల పాటు వేడుకగా జరుపుకుంటారు.

ధనత్రయోదశి నుంచి అమావాస్య వరకు మూడు రోజుల పాటు దీపావళి పండుగను జరుపుకుంటుంటారు. ఈనెల 30 నుంచి నవంబరు 1 వరకు మూడు రోజుల పాటు పండుగను జరుపుకుంటాం. నరకుడిని సత్యభామ సంహరించారని చెప్తుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి రోజున దీపాలు వెలిగించి ఆరోజు ప్రత్యేకంగా పూజలు చేసుకుంటారు.

ఇదిలా ఉండగా.. దీపావళి రోజు అత్యంత అరుదైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. నవంబర్ 1న సూర్యోదయం వేళ అమావాస్య ఉంది. అందుకే ఆరోజున చాలా మంది లక్ష్మీదేవీని పూజించుకుంటారు. అదే రోజున అత్యంత అరుదైన లక్ష్మీనారాయణ యోగం సంభవిస్తుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి అఖండ ధనలాభంతో పాటు చేసు పనుల్లో విజయాలు లభిస్తాయి. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం.

తుల ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వల్ల ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్ని పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు ఉన్నాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది.

మిథునం..ఈ రాశి వారికి ఈ యోగం వల్ల ధనంతో పాటు, కొత్త ఇల్లు కల సాకారం అవుతుంది. మీరు కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు. భార్యతరపు ఆస్తులు మీ సొంతమౌతాయి.

మీనం.. ఈ రాశివారికి లక్ష్మీనారాయణ యోగం ప్రభావం వల్ల విందులు వినోదాల్లో ఎక్కువగా గడుపుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. పెళ్లి కానీ వారికి వివాహా యోగం కూడా కన్పిస్తుంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link