Diabetes Control Tips: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ టీలతో మధుమేహానికి చెక్..
ఆధునిక జీవన శైలి కారణంగా వ్యాధులను దృష్టిలో పెట్టుకుని చాలా మంది గ్రీన్ టీలనే తాగుతున్నారు. అయితే ఈ టీలలో శరీరానికి కావాల్సి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కావున బాడీకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.
గ్రీన్ టీలో ఉండే పోషక విలువలు రక్తంలో చక్కెరపై ప్రభావవంతంగా పని చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో పెరుగుతున్న ఇన్సులిన్ స్థాయిని నియత్రించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. కావున షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ గ్రీటీని ఉదయం పూట ఒక్కసారి.. సయంత్రం పూట ఒక్క సారి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
మందారం టీనే కాకుండా మధుమేహానికి చమోమిలే పువ్వుల టీ కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ అధిక పరిమాణంలో ఉంటాయి. ఇది క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించేందుకు మందారం టీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కావున వానా కాలంలో దీనిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా మధుమేహంతో బాధపడుతున్నవారికి కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కావున వీరు క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మందారం టీలో శరీర రోగనిరోధక శక్తిని పెంచే చాలా రకాల గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ టీని రోజూ తీసుకుంటే అలసట, ఒత్తిడి వంటి సమస్యలు దూరమవుతాయి. కావున ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ టీలను తీసుకోవాలి. ఈ టీలో యాంటీఆక్సిడెంట్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కావున శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తుంది.