Diabetes Ayurvedic Tips: ఈ ఐదు పదార్ధాలు రోజూ తీసుకుంటే మధుమేహానికి నెలలోనే చెక్
మధుమేహం తగ్గించేందుకు ఆయుర్వేద చిట్కాలు
ఇటీవలి కాలంలో మధుమేహం వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి పదిమందిలో 5 మందికి కచ్చితంగా డయాబెటిస్ ఉండే పరిస్థితి. భవిష్యత్తులో ఈ ముప్పు మరింత పెరగనుంది. డయాబెటిస్ రోగులు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచేందుకు ఎప్పుడూ ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనారోగ్యకరమైన ఆహారం, చెడు ఆహారపు అలవాట్లు మంచిది కాదు. బ్లడ్ షుగర్ నియంత్రించే 5 ఆయుర్వేద చిట్కాల గురించి పూర్తి వివరాలు ఇలా...
నేరేడు ఆకులు
నేరేడు ఆకులు, నేరేడు విత్తనాలు, నేరేడు పండ్లు అన్నీ డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు అద్భుతంగా పనిచేస్తాయి. నేరేడు ఆకులో ఉండే జంబోలన్ అనే పోషక పదార్ధం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
వేపాకులు
వేపాకులు, విత్తనాలు సేవించడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే నింబిన్ అనే పోషక పదార్ధం చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది.
Hibiscus Tree
మందారం చెట్టు ఆకులు మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. ఇందులో ఉండే ఫెనూలిక్ యాసిడ్ బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గిస్తుంది.
మెంతులు
మెంతులు బరువు నియంత్రణతో పాటు డయాబెటిస్ తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుందని చాలా మందికి తెలుసు. రోజూ పరగడుపున తీసుకుంటే అద్భుత ఫలితాలుంటాయి.
కాకరకాయ
కాకరకాయ మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఓ వరం లాంటిది. ఇందులో ఉండే చార్యా చాలా ప్రయోజనకరం. బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది.