Dry Fruits: షుగర్ లెవెల్స్‌ను అదుపు చేసే అద్భుతమైన డ్రై ఫ్రూట్స్!
బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు ఆహారంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.
అధిక శాతం ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం ఉండే ఆహారపదార్థాలను చేర్చుకోవాల్సి ఉంటుంది.
బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించడానికి సహాయపడే డ్రై ఫ్రూట్స్
అంజీర్: అంజీర్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది షుగర్ లెవెల్స్‌ను అదుపు చేయడంలో ఎంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఒక అంజీర్ తీసుకోవడం చాలా మంచిది.
బాదం: బాదంలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మెగ్నీషియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
వాల్‌నట్స్: వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. అలాగేశరీరా నొప్పులను తగ్గించడంలో మేలు చేస్తాయి.
పిస్తా: పిస్తాలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
గమనిక: ఈ సమాచారం వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి ఆందోళన చెందుతుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.