Diesel Spill: కీసరవైపు వెళుతున్న వాహనదారులు జరభద్రం‌.. రోడ్డుపై డీజిల్‌ లీక్‌ 70 మంది బైకర్లకు గాయాలు..

Sun, 01 Dec 2024-6:21 am,

కుషాయిగూడ నుంచి నాగారం మార్గంలో కీసర వెళ్తున్న వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌ ఆ మార్గంలో ఆయిల్ ట్యాంకర్‌ నుంచి డీజిల్‌ లీక్ అవ్వడంతో వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. దాదాపు 70 మంది బైకర్లు స్కిడ్‌  అయి కిందపడ్డారు. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి.   

ఈ ఘటనలో ఒకరు చనిపోయారని, మరో మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం.  ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన జరగలేదు. ఈ మార్గం గుండా వెళ్తున్న బైకర్లు జర భద్రం. ఇప్పటికే పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.  

నిత్యం వేలమంది ప్రయాణం చేసే ఈ రోడ్డు గుండా ఈసీఐఎల్‌ నుంచి వచ్చిన ఈ ఆయిల్‌ ట్యాంకర్‌ కీసర వైపుగా వెళ్లింది. కానీ, ఆ లారీ నుంచి ఉన్నట్టుండి రోడ్డుపై ఇలా డీజిల్‌ లీక్‌ అవ్వడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసుల సమాచారం.  

కుషాయిగూడ పోలీసులు ఈ దారిగుండా వెళ్లే వాహనాలను మళ్లింపు చర్యలు ఇప్పటికే చేపట్టారు. డిజీల్‌ లీక్‌ అయిన ప్రాంతంలో ఇసుక పోశారు. ఆ తర్వాత యథావిధిగా వాహనాలు వెళ్లడం ప్రారంభమయ్యాయి.  

అయితే, డీజిల్‌ వాహనం ఇంకా పోలీసులు గుర్తించాల్సి ఉంది. నిత్యం ఎంతో మంది ప్రయాణం చేసే ఈ రహదారి గుండా ఇలా డీజిల్‌ లీక్‌ అవ్వడంతో ఉన్నట్టుండి వాహనదారులు ఉలిక్కిపడ్డారు. నిన్న వీకెండ్‌ కార్తీక మాసం చివరి రోజు కావడంతో కీసర గుట్టకు వేల సంఖ్యలో భక్తులు ఈ మార్గం గుండా ప్రయాణాలు చేశారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link