Diet For Weight Loss: వీటితో కేవలం వారం రోజుల్లో 2 కేజీల బరువు తగ్గడం ఖాయం

Mon, 10 Jul 2023-5:18 pm,

బరువు తగ్గడానికి వ్యాయామాలతో పాటు ఆహారాలను డైట్‌ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడమేకాకుండా శరీరం యాక్టివ్‌గా మారుతుంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆహార చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.  

బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు డైట్‌లో తప్పకుండా బ్లాక్‌ రైస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. దీంతో మీరు ప్రతి రోజు ఆహారంలో ఈ రైస్‌ను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.

బ్లాక్‌ రైస్‌ ప్రతి రోజు ఆహారంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడమేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, శరీరంలో కొలెస్ట్రాల్‌ నియంత్రించుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ రైస్‌ను ట్రై చేయాల్సి ఉంటుంది.   

ప్రస్తుతం మార్కెట్‌లో నల్ల వెల్లుల్లి కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించడం వల్ల కూడా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ధమనుల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.  

ప్రతి రోజు బ్లాక్‌ టీని తాగడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉన్న గుణాలు మెదడు పనితనాన్ని కూడా మెరుగుపరుచుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ టీని తాగాల్సి ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link