Dil Raju: TFDC అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు.. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి సహా ప్రముఖుల అభినందనలు..

Thu, 19 Dec 2024-12:20 am,

Dil Raju: ఆంధ్ర పెత్తనం ఉండే సినీ పరిశ్రమలో తెలంగాణ నుంచి నిర్మాతగా ప్రస్థానం మొదలు పెట్టి అంచలంచెలుగా అగ్ర నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు.తాజాగా తెలంగాణలో కొలువైన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంకట రమణా రెడ్డి అలియాస్ దిల్ రాజుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ (TFDC) గా బాధ్యతలు స్వీకరించారు.

బుధవారం ఉదయం తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

TFDC చైర్మన్ గా తనకు ఛాన్స్ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు తెలుగు సినిమాకు పూర్వ వైభవం తీసుకువస్తానన్నారు.  అందుకు అందరి సహకారం తీసుకుంటానని చెప్పారు.  

 

మరోవైపు తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తెలుగు సినీ పరిశ్రమ చెన్నై (మద్రాస్) నుంచి వచ్చిన తర్వాత  గుర్తింపు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందేలా కృషి చేస్తానన్నారు.

TFDC చైర్మన్ గా నాపై చాలా బరువైన భాద్యత ఉందన్నారు. అంతేకాదు సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటానన్నారు. అంతేకాదు సినీ పరిశ్రమకు చెందిన సమస్యలను పరిష్కరిస్తానన్నారు. మరోవైపు సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్య లతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

 టీఎఫ్ డీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు కు  తెలుగు చలన చిత్ర పరిశ్రమ  తరపున తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హృదయ పూర్వక అభినందనలు తెలియజేసింది. దిల్ రాజు నాయకత్వంలో తెలంగాణా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని మేము విశ్వసిస్తున్నట్టు తమ ప్రకటనలో తెలిపారు.

మరోవైపు దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ .. ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా వచ్చే నెల 10వ తేదిన విడుదల కానుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link