Divya Sridhar: లేటు వయస్సులో ఘాటు ప్రేమ.. 50 ఏళ్ల నటుడిని పెళ్లి చేసుకున్న 37 ఏళ్ల ప్రముఖ నటి, పిక్స్ వైరల్!
ప్రముఖ మలయాళ నటి దివ్య శ్రీధర్ బుధవారం వివాహం చేసుకున్నారు. 37 ఏళ్ల ఈ బుల్లితెర నటి 50 ఏళ్ల క్రిస్ వేణుగోపాల్‌ను వివాహం చేసుకున్నారు.
ఇరువురి వివాహం గురువాయూర్‌లో జరిగింది. అయితే, దివ్య శ్రీధర్‌కు ఇది వరకే వివాహం జరిగింది. ఆమెకు మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దివ్యకు ఇది రెండో పెళ్లి
ఓ సీరియల్ షూటింగ్‌లో వీరికి పరిచయం అయింది. అది కాస్త వారికి ఒక్కటి చేసింది. ఇక దివ్య సీరియల్‌లో ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేస్తుంది.
ఈమెకు ఇప్పటికే ఓ కొడుకు, కూతురు ఉన్నారు. పెళ్లి తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దివ్య తన పిల్లలకు ఈ పెళ్లి ఇష్టమే, వారికి నాన్న ప్రేమ దొరుకుతుంది అన్నారు.
ఇక క్రిస్ వేణుగోపాల్ విషయానికి వస్తే ఆయన ఓ రచయిత, వాయిస్ ఆర్టిస్ట్, యాక్టర్. వీరిద్దరూ సీరియల్స్‌తోపాటు పలు సినిమాల్లో కూడా నటించారు. ప్రస్తుతం వీళ్లు పెళ్లి చేసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.