Diwali 2022 : దీపావళి స్పెషల్.. నాభి అందాలతో నభా నటేష్‌.. ఇస్మార్ట్ పిక్స్ వైరల్

Sun, 23 Oct 2022-8:30 am,

బుల్లితెరపై అయినా, వెండితెరపై అయినా కూడా కన్నడ భామలకు మంచి క్రేజ్ ఉంటుంది. శాండిల్ వుడ్ బ్యూటీల అందాలకు తెలుగు వారు ఫిదా అవుతుంటారు. అలా కన్నడ బ్యూటీ అయిన నభా నటేష్ ప్రస్తుతం మంచి క్రేజ్ తెచ్చుకుంది.

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. కన్నడ చిత్రాలు చేసిన నభా.. ఈ సినిమాతో తెలుగు వారి ముందుకు వచ్చింది. నన్ను దోచుకుందువటే సినిమా అంతగా హిట్ కాకపోయినా.. నభా పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.

నభా నటేష్‌కు ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే అసలు సిసలు ఇమేజ్ వచ్చింది. ఆమె ఖాతాలో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ పడ్డట్టు అయింది. పూరి జగన్నాథ్ హీరోయిన్‌లో ఉండే యాటిట్యూడ్, గ్లామర్ అన్నీ కూడా నభాలో ఉండటంతో సినిమాలో దుమ్ములేపేసింది.

తెలంగాణ యాసతో అందరినీ మెప్పించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత ఆమెకు ఫుల్ ఆఫర్లు వచ్చాయి. అయితే అందులో అల్లుడు అదుర్స్ ఫ్లాప్ అవ్వగా.. సోలో బ్రతుకే సో బెటర్ హిట్ అయింది. ఇక మళ్లీ ఇంత వరకు ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది.

సినిమాలతో ప్రేక్షకులను పలకరించకపోయినా.. ఆమె తన ఫోటోలు, ఫోటో షూట్లతో అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె తన అందాలను చూపిస్తూ షేర్ చేసిన ఫోటోలను చూసి అందరూ అవాక్కవుతున్నారు. దీపావళి స్పెషల్ అంటూ నభా మంట పెట్టేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link