Diwali 2024: అదిరిపోయే శుభ వార్త.. 9 రూ. లకే టపాసుల ప్రమాదం నుంచి బీమా .. కవరేజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లోయింగ్..
సాధారణంగా దీపావళి అంటేనే టపాకాయల్ని కాల్చి మరీ పండగ చేసుకుంటారు. ఈరోజు భారీ ఎత్తున దేశమంతా క్రాకర్స్ కాలుస్తుంటారు. చిన్న, పెద్ద తేడా లేకుండా రంగు రంగుల క్రాకర్స్ కాలుస్తుంటారు.
అయితే.. కొన్నిసార్లు దీపావళి వేడుకలు జరుపుకునే పెద్ద క్రాకర్స్ పేలుస్తుంటారు. కొన్ని రాష్ట్రాలలో టపాకాయల్ని కాల్చడం మాత్రం నిశేధించారు. అక్కడ క్రాకర్స్ కు బదులుగా శబ్దతీవ్రత తక్కువగా ఉండే టపాసుల్ని ఉపయోగిస్తుంటారు.
కొన్నిసార్లు టపాసులు పేల్చేటప్పుడు అనుకొని ఘటనలు చోటు చేసుకుంటాయి. సాధారణంగా పెద్దలు పక్కనే ఉండి, పిల్లలతో టపాసులను పేల్చేలా చూస్తారు.
కానీ కొన్నిసార్లు క్రాకర్స్ చేతిలో బ్లాస్ట్ అవ్వడం లేదా క్రాకర్స్ పేలుడుకు గురై నిప్పురవ్వలు కళ్లలో లేదా శరీరంపై పడటం జరుగుతుంటాయి.దీని వల్ల ఆ భాగాలు కాలిపోయి దెబ్బతింటాయి.
ఈ నేపథ్యంలో ఫోన్ పే ఈసారి మాత్రం సూపర్ ప్లాన్ తీసుకొచ్చిందని చెప్పుకొవచ్చు. కేవలం 9 రూపాయలతో.. క్రాకర్స్ నుంచి సెఫ్టీని పొందే ఒక పాలీసీని తీసుకొచ్చింది. ఇది యూజర్ లకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందని ఫోన్ పే పేర్కొంది.
ఈ 9 రూపాయలు చెల్లించిన వారికి అక్టోబరు 25 నుంచి పదిరోజుల పాటు ఆ బీమా కవరేజ్ వర్తిస్తుందని చెప్పుకొవచ్చు. ఈ బీమా కింద.. యూజర్ తో పాటు, భార్య, పిల్లలు సహా నలుగురు వ్యక్తులకు కూడా దీన్ని వర్తింపు చేస్తారు.
ఒక వేళ అక్టోబర్ తర్వాత ఈ పాలసీని కొంటే.. అప్పటి నుంచి ఈ బీమా కవరేజ్ ప్రారంభమౌతుంది. దీపావళి నేపథ్యంలో ఈ ఫోన్ పే లో ఇన్సురెన్స్ పాలసీనీ తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది.
దీనికోసం యూజర్ లు.. ఫోన్ పేలోని ఇన్సూరెన్స్ సెకన్ లోనికి వెళ్లి.. ఫైర్ క్రాకర్స్ ఇన్సూరెన్స్ అని టైప్ చేయాలి. దాన్ని సెలక్ట్ చేసుకుని వివరాలు ఇచ్చి పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.