మీకు టీతో పాటు బిస్కట్ తినే అలవాటుందా..అయితే వెంటనే మానేయండి మరి
బిస్కట్‌లో షుగర్ స్థాయి చాలా ఎక్కువగానే ఉంటుంది. రోజూ బిస్కట్లు తినడం వల్ల పళ్లకుండే ఎనామిల్ దెబ్బతింటుంది. దాంతో దంతాల కేవిటీ క్షీణిస్తుంది.
బిస్కట్‌ను రిఫైండ్ పిండితో తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండదు. ఫలితంగా బిస్కట్లు ఎక్కువ తినడం వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అదే సమయంలో బిస్కట్ లేదా కుకీస్‌లో బీహెచ్‌టీ పేరున్న రెండు ప్రిజర్వేటివ్‌లు వేస్తారు. ఇది ఆరోగ్యానికి నష్టం చేకూరుస్తుంది.
బిస్కట్‌లో ఎక్కువ సుగర్ ఉండటం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది.
ఎక్కువకాలం టీతో తీపి బిస్కట్లు తింటే బ్లడ్ సుగర్ స్థాయి పెరుగుతుంది. అంతేకాకుండా సోడియం స్థాయి పెరుగుతుంది. డయాబెటిస్, థైరాయిడ్ రోగులు బిస్కట్ తినకూడదు.
బిస్కట్‌లో హైడ్రోజెనెటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. బిస్కట్ ఎప్పుడూ ఫ్యాట్ లేకుండా ఉండదు. అందుకే దీర్ఘకాలం బిస్కట్లు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు..ఫలితంగా లావెక్కే ప్రమాదముందంటున్నారు నిపుణులు