Aadhaar Card: ఆధార్ కార్డుపై పేరు, అడ్రస్, పుట్టినతేదీని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్ తెలుసుకోండి..
ఆధార్ కార్డుతోనే అన్ని లావాదేవీలు జరుగుతాయి. ఇది లేకపోతే ఏ పని జరగదు. ఆధార్ కార్డు ప్రతిఒక్కరికీ అవసరం. అయితే, ఒక్కోసారి ఆధార్ కార్డు, పుట్టినతేదీ, పేరు మార్చుకుంటారు. ఎన్నిసార్లు మార్పులు చేసుకోవచ్చు తెలుసుకుందాం.
అయితే, ఆధార్ కార్డు అప్డేట్ చేసేముందు కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఆధార్ కార్డుపై పేరును రెండుసార్లు మార్చుకోవచ్చు. ఇదిలా ఉంటే జెండర్, పుట్టినతేదీ కేవలం ఒక్కసారి మాత్రమే మార్చుకోవాలి.
ఇక మీ అధికారిక అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. ఆధార్ కార్డుపై ఎన్ని మార్లు అయినా అడ్రస్ మార్చుకునే సదుపాయం యూఐడీఏఐ కల్పించింది. దీనికి రెంటల్ అగ్రిమెంట్, వాటర్ బిల్, టెలిఫోన్ బిల్ ప్రూఫ్ పెట్టాల్సి ఉంటుంది.
ఈ మార్పులను ఆన్‌లైన్ ఆధార్ సెంటర్లు మీ దగ్గర్లో అందుబాటులో ఉంటాయి. పెళ్లి తర్వాత మహిళలు ఇంటిపేరు మార్చుకోవాల్సి ఉంటుంది. వారు దగ్గర్లో ఆధార్ నమోదు సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఫారమ్ దరఖాస్తు చేసుకునేటప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది.
అడ్రస్‌ను మార్చుకునే విధానం.. యూఐడీఏఐ myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో మార్చుకోవచ్చు. అందులో 12 డిజిట్స్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్, ఓటీపీ నమోదు చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ ద్వారా ఓటీపీ ఎంటర్ చేయండి.
ఆ తర్వాత ఆధార్ అప్డేట్ ఎంచుకోవాలి. అందులో ప్రొసీడ్ ఆధార్ అప్డేట్‌లో మీ ప్రెజంట్ అడ్రస్ నమోదు చేయండి. సంబంధించిన ధృవపత్రాలను అప్లోడ్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత అప్డేట్ అవుతుంది. మీ మొబైల్ నంబర్‌కు అప్డేట్స్ వస్తాయి.