Beetroot: బీట్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..?
బీట్రూట్ జ్యూస్ లో విటమిన్ సి, విటమిన్ ఏ , ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కొవ్వు కాలేయాన్ని నిరోధించి, శక్తిని మెరుగుపరుస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి
అయితే సమృద్ధిగా పోషకాలు ఉన్న ఈ జ్యూస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగి ఉంటాయి. బీట్రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బీటూరియా అనే వ్యాధి వస్తుంది. దీని వల్ల మూత్రం లేదా మలం ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారే అవకాశం ఉంటుంది.
బీట్రూట్ జ్యూస్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో లోహ అయాన్లు పేరుకుపోయి, దీర్ఘకాలిక కాలేయానికి దెబ్బ కలగవచ్చు. జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. అధిక మొత్తంలో తీసుకుంటే పొత్తికడుపు తిమ్మిరి , అసౌకర్యానికి దారి తీయవచ్చు.
బీట్రూట్ అలాగే క్యారెట్ జ్యూస్ కలిపి తీసుకుంటే శరీరంలో క్యాల్షియం స్థాయిలు పూర్తిగా తగ్గిపోతాయి.
అంతేకాదు బీట్రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. గర్భిణీ స్త్రీలు బీట్రూట్ రసానికి చాలా దూరంగా ఉండాలి. అధిక మొత్తంలో నైట్రేట్లను తీసుకునే గర్భిణీ స్త్రీలకు తలనొప్పి, కళ్ళు తిరగడం, నోరు, పెదవులు, చేతులు , పాదాలు చెట్టు నీలం, బూడిద రంగు లోకి మారే అవకాశం ఉంటుంది. బిపి తక్కువ అవడం లేదా మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.
బీట్రూట్ మధ్యాహ్నం లేదా సాయంత్రం తాగడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. పగటిపూట తీసుకోవడం వల్ల అలసట తగ్గుతుంది. సాయంత్రం తాగడం వల్ల శరీర రంగు మెరుగుపడుతుంది.