Drop OnePlus Nord 3 Price: అమెజాన్‌లో OnePlus Nord 3 మొబైల్‌పై రూ.28,450 డిస్కౌంట్..పూర్తి వివరాల కోసం..
ఇటీవలే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ నుంచి మార్కెట్లోకి విడుదలైన వన్ ప్లస్ నార్డ్ 3 5G (OnePlus Nord 3 5G) మొబైల్ ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అదనంగా ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. అయితే దీనిపై అమెజాన్‌లో ఉన్న మరిన్ని ఆఫర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వన్ ప్లస్ నార్డ్ 3 5G (OnePlus Nord 3 5G) మొబైల్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి 12 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది అయితే ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.33,999 కాగా.. ప్రత్యేక తగ్గింపు ఆఫర్లలో భాగంగా కేవలం రూ.29,999కే లభిస్తోంది.
అదనంగా ఈ వన్ ప్లస్ నార్డ్ 3 5G (OnePlus Nord 3 5G) స్మార్ట్ ఫోన్ పై తగ్గింపు పొందాలనుకునేవారు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి రూ.2,000 వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతోపాటు అమెజాన్ అందించే ప్రత్యేక కూపన్‌తో మరో రూ.2,000 తగ్గింపు పొందవచ్చు.
ఇలా బ్యాంక్ ఆఫర్‌తో పాటు కూపన్ తగ్గింపు రెండు కలిసి రూ.4,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ వన్ ప్లస్ నార్డ్ 3 5G మొబైల్ ను కేవలం రూ.25,999కే పొందవచ్చు.
అంతేకాకుండా అదనపు తగ్గింపు ఆఫర్ పొందడానికి బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా వన్ కార్డ్ తో పాటు ఎస్‌హెచ్‌బిసి క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా రూ. 2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు వినియోగించిన కూడా డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ ఈ వన్ ప్లస్ నార్డ్ 3 5G (OnePlus Nord 3 5G) మొబైల్ పై భారీ తగ్గింపు పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా ఈ వన్ ప్లస్ కొత్త మొబైల్ ని కొనుగోలు చేస్తే దాదాపు రూ.28,450 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇక ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను వినియోగించుకోవాలనుకునేవారు తప్పకుండా వారి పాత స్మార్ట్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్‌ను బట్టి ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. కండిషన్ బాగుంటే ఈ కొత్త వన్ ప్లస్ నార్డ్ 3 5G (OnePlus Nord 3 5G) మొబైల్ రూ.2,000లోపే లభిస్తుంది.