Kuja Stambhana 2024: కుజ స్తంభన వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న 2 రాశులు.. జాక్‌పాట్‌ కొట్టబోతున్నారు

Tue, 22 Oct 2024-9:18 am,

ముఖ్యంగా పాపగ్రహాలు అయిన కుజుడు, రాహువు, కేతువు వంటివి ఒక రాశిలో ఉండాల్సిన రోజు కంటే ఎక్కువ రోజులు ఉంటే దాన్ని స్తంభన అంటారు. ముఖ్యంగా ఈసారి కుజుడు 2024-2025 మధ్యలో ఎక్కువ రోజులపాటు కుజుడు ఉంటాడు.   

సాధారణంగా అయితే, ఒక రాశిలో కుజుడు 45 రోజులు మాత్రమే ఉంటాడు. దీనికి మించి ఒక రాశిలో ఉంటే కుజ స్తంభన అంటారు. కానీ, దీని వల్ల కొన్ని రాశులకు విపరీత రాజయోగం కలుగుతుంది. మొన్నటి వరకు మిథున రాశిలో స్తంభించిన కుజుడు ఆ తర్వాత 2025 జనవరి 22 వరకు కర్కాటక రాశిలో స్తంభించి పోతాడు   

సింహ రాశి.. సింహ రాశిలో లాభ స్థానంలో స్తంభించాడు. ఆర్థికంగా లాభపడతారు. శత్రుపీడ నుంచి ఉపశమనం కలుగుతుంది. అప్పుల బాధ నుంచి బయటపడతారు. ముఖ్యంగా శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. ఇది పూర్తిగా సింహ రాశివారికి అదృష్ట కాలం.

మేషరాశి.. మేషరాశి వారికి కుజ స్తంభన వల్ల వ్యాపారులు బాగా లాభపడతారు. అప్పుల బాధ నుంచి బయట పడతారు. రియల్‌ ఎస్టేట్‌ చేసే వారికి కాసుల వర్షం కురిపించే సమయం. కుటుంబంలో కూడా సఖ్యత, ఆర్థిక లాభం కలుగుతుంది.

కుజ స్తంభనతో అఖండ రాజయోగం పట్టబోతున్న ఈ రాశి. రోగాల నుంచి బయటపడతారు. అప్పుల ఊబి నుంచి కూడా ఎంతో ఈజీగా బయటపడతారు. అంతేకాదు ఈ సమయంలో శత్రు పీడ నుంచి ఉపశమనం కలుగుతుంది. స్నేహితులతో విహార యాత్ర కూడా చేస్తారు  

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link