Mars Transit 2023: అంగారకుడు సంచారంతో ఈ 5 రాశుల వారికి బోలెడు ప్రయోజనాలు, ముట్టింది బంగారం అవ్వడం ఖాయం!

Sat, 12 Aug 2023-1:06 pm,

మీన రాశి వారికి అంగారక గ్రహ సంచారం కారణంగా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా జీతాలు పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వీరు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.  

అంగారపుడి సంచారం ఎఫెక్ట్ కుంభ రాశి వారిపై కూడా సమానంగా పడుతుంది. ఈ క్రమంలో కుంభ రాశి వారు స్వల్ప ప్రయోజనాలు పొందుతారు. ఇక ఉద్యోగాలు చేసేవారు కుటుంబం ప్రోత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారు. వీరు ఈ సంచారం కారణంగా కుటుంబంతోని ఎక్కువ గడిపేందుకు ప్రయత్నిస్తారు.  

మేష రాశి వారికి అంగారక గ్రహం సంచారం కారణంగా కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు. ఈ క్రమంలో వీరి తల్లిదండ్రులు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా కోపం కారణంగా కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు అని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు.

వృషభ రాశి వారికి ఈ సంచారం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వీరికి మానసిక ప్రశాంతత తగ్గి ఉద్యోగ జీవితం పై ఒత్తిడి పెరుగుతుంది దీనికి ఆనందంగా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు.  

కర్కాటక రాశి వారికి అంగారక గ్రహ సంచారం కారణంగా కోరికలు పెరుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వీరు కొన్ని రోజులపాటు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link