Surya Budha Yuti 2024: కన్యారాశిలో బుద్ధాదిత్య యోగం.. ఈ 5 రాశులకు వరం, వ్యాపారంలో లాభం..!
మరో 3 రోజుల్లో రాశి మారనున్నాడు. ఈ సంచారం వల్ల 5 రాశులకు లక్ కలిసి వస్తుంది.సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఈ రాశులకు ఆర్థికంగా బలపడతారు.
ఆశ్వీయుజ మాసంలో సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తాడు. ఈ మాసం భాద్రపద మాసం ముగియగానే ప్రారంభమవుతుంది. ఈ ఆశ్వీయుజ మాసంలో పితృపక్షం రోజులు కూడా ప్రారంభమవుతాయి. 16 రోజులపాటు పితరులకు తర్పణం, పిండ ప్రదానం చేస్తారు.
ఈ ఆశ్వీయుజ మాసంలో బుధుడు కూడా సూర్యుడు ఉన్న కన్యా రాశిలోకి సంచరిస్తాడు. ఇలా సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో సంచారం చేయడం వల్ల బుద్ధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది అత్యంత శ్రేష్టం.
బుద్ధాదిత్య యోగం వృషభం, సింహం, కన్య, కుంభం ,మీన రాశుల వారికి బాగా కలిసి వచ్చే సమయం. ఆశ్వీయుజ మాసంలో బుధాదిపత్యం కొనసాగుతుంది. దీంతో ఈ రాశులకు వ్యాపారలంఓ లాభాలు ఆర్థిస్తారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)