Lunar Eclipse 2025 Effect: 2025లో తొలి చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఏయే రాశులకు ఎలా ఉంటుందంటే..
గత సంవత్సరం మాదిరిగానే రాబోయే 2025 సంవత్సరంలో కూడా సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. గ్రహాల ప్రభావం రాశులపై ఎలా పడుతుందో గ్రహణాల ప్రభావం కూడా అలాగే పడుతుందని జ్యోతిష్య శాస్త్రంలో క్లుప్తంగా వివరించారు. సమయం, గ్రహణాన్ని బట్టి మనిషి జీవితం ప్రభావితం అవుతుంది.
2025 సంవత్సరంలో జరిగే మొదటి చంద్రగ్రహణం వల్ల మొత్తం ద్వాదశరాశుల వారిపై శక్తివంతమైన ప్రభావం పడబోతోంది. దీనివల్ల మేషరాశి నుంచి మీన రాశి వారి జీవితాల్లో అనేక మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
2025 సంవత్సరంలో జరగబోయే మొదటి చంద్రగ్రహణం పాల్గొనమాసం పౌర్ణమి అంటే మార్చి 14వ తేదీన సంభవించబోతోంది. ఇది ఈ ఏడాదిలో వచ్చే మొదటి చంద్రగ్రహణంగా ఖగోళ శాస్త్రం నిపుణులు చెబుతున్నారు.
మార్చి 14వ తేదీన చంద్రగ్రహణం ఒక ప్రత్యేకమైన సమయంలో సంభవించబోతుంది. ఇక దీనికి సంబంధించిన సమయం వివరాల్లోకి వెళితే.. ఉదయం 9:29 నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఈ చంద్రగ్రహణం కొనసాగుతుందట.
ఇక భారత దేశ విషయానికొస్తే.. ఈ సంవత్సరం ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం మనదేశంలో కనిపించదని ఖగోళ శాస్త్రాన్ని పునులు చెబుతున్నారు. అందుకే ఇది ఏర్పడడం వల్ల వచ్చే సూతక్ కాలం కూడా ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీనివల్ల ఎలాంటి గ్రహ ప్రభావం వ్యక్తుల జీవితాలపై కూడా పడే అవకాశాలు లేవు.
కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు.. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావం ఉండదట. అంతేకాకుండా చంద్రగ్రహణ సమయంలో ఎలాంటి పనులైనా చేసుకోవచ్చని వారు అంటున్నారు.