Dussehra Ayudha puja 2024: ఆయుధ పూజ మూహుర్తం ఎప్పుడు..?.. ఇలా పూజిస్తే బిజినెస్‌లో లాభాలు.. డబుల్ ట్రిబుల్ అవుతాయి..

Thu, 10 Oct 2024-7:25 pm,

దేశమంతాట కూడా దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు అక్టోబరు 3 నుంచి అక్టోబరు 12 వరకు నిర్వహించుకుంటారు. అయితే... దసరాకు ఒక రోజు ముందు ఆయుధ పూజను జరుపుకుంటారు.

ఎవరు ఏ వృత్తి చేస్తారో వారు ఆరోజు దాన్ని ఆయుధంగా భావించి పూజిస్తారు.  అందుకే శరన్నవరాత్రులలో దుర్గాదేవీ అనుగ్రహాం కోసం ఆయుధ  పూజను నిర్వహిస్తారు.  ఈసారి అక్టోబరు 11న ఆయుధ పూజను జరుపుకుంటున్నారు.

ఈరోజున కొన్ని మూహుర్తాలలో ఆయుధ పూజలు చేస్తే లాభాలు తప్ప నష్టాలు అస్సలు రావు. అయితే.. శుక్రవారం రోజు.. ఆయుధ పూజకు మంచి మూహుర్తంను పండితులు సూచించారు. ఈరోజున  అంటే.. ఉదయం 8 నుంచి 11 వరకు దివ్యమైన మూహుర్తం ఉందంట. ఆ తర్వాత మళ్లీ.. సాయంత్రం 4 నుంచి 8 రాత్రి వరకు శుభమైన మూహుర్తముందని పండితులు చెబుతున్నారు.  

అదే విధంగా.. దుర్గా దేవీని అనుగ్రహాం ఉంటే మనం ఏరంగంలో ఉన్న రాణిస్తామని పండితులు చెబుతున్నారు. ఈరోజున ఉద్యోగం చేసే వాళ్లు, అనేక వృత్తుల వారు తమ పనిముట్లను ప్రత్యేకంగా అలంకరణ చేసిన పూజిస్తారు.  

కొన్ని చోట్ల ఈ పని ముట్లకు మేకలు లేదా కోళ్లను సైతం బలిగా ఇస్తుంటారు. అందుకే ఈ కార్యక్రమానికి గొప్ప ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. అదే విధంగా పండితుల ప్రకారం.. ఈ రోజున మనం ఏపని మొదలు పెట్టిన కూడా అది ఎప్పుడు కూడా ఆగకుండా పూర్తవుతుందని చెప్తారు.  

ఆయుధ పూజ రోజున.. పసుపు బట్ట తీసుకుని దానిలో బియ్యం, పసుపు, పోక పెట్టాలి. దాన్ని మూటకట్టి లాకర్లో పెట్టుకొవాలి. ఇలా ఏడాది పాటు.. కదపకుండా చూసుకొవాలి.ఇలా చేస్తే అది ధనాన్ని ఆకర్శిస్తుందని చెప్తుంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link