Navratri 2024: రేపే శక్తివంతమైన ‘లలిత పంచమి’.. ఈ ఒక్కపని చేస్తే అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం..
అశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రుల్ని వైభంగా నిర్వహిస్తారు. అక్టోబరు 3 నుంచి 12 వరకు వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు.
ప్రతిరోజు దుర్గమ్మ వారు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. నవరాత్రులలో దుర్గామాత యొక్క తొమ్మిది అవతారాలను పూజించుకుంటారు.· 1. శైలపుత్రి:2. బ్రహ్మచారిణి:3. చంద్రఘంట: 4. కూష్మాండ: 5. స్కందమాత: 6. కాత్యాయని:7. కాళరాత్రి: 8. మహాగౌరి: ఇలా అమ్మవారిని పూజించుకుంటారు.
నవరాత్రులలో ప్రతిరోజు ఒక నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకుంటారు. ఈ నేపథ్యంలో నవరాత్రులలో పంచమికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అక్టోబరు 11న లలిత పంచమిని భక్తితో జరుపుకుంటారు. ఈరోజున దుర్గమ్మ వారు లలితా దేవీ రూపంలో దర్శనమిస్తారు.
లలితా దేవీ చేతిలో చెరుకుగడ మనకు కన్పిస్తు ఉంటుంది. అయితే.. లలిత పంచమి రోజున కొన్ని పనులు చేస్తే జీవితంలో ఎలాంటి లోటు కూడా ఉండదని పండితులు చెబుతుంటారు. ఈ రోజున అమ్మవారిని లలిత సహస్రనామ పారాయణం చదివితే మంచి జరుగుతుందని పండితులు చెబుతుంటారు.
అంతే కాకుండా.. లలిత అష్టోత్తర శతనామావళి, లలితా దేవీకి చెందిన స్తోత్రాలు చదివితే మంచి జరుగుతుందని పండితులు చెబుతుంటారు. ఈరోజున అమ్మవారిని చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలని పండితులు చెబుతున్నారు. ఎరుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించుకొవాలి.
దుర్గమ తల్లికి ఏదైన ఎరుపు రంగు గాజులు, ఎర్రటి పూలు వంటివి అర్పిస్తే అమ్మవారి అనుగ్రహాం కల్గుతుందని పండితులు చెబుతున్నారు. జీవితంలో కష్టాలు పడుతున్నవారు.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు.. లలిత పంచమి రోజున అమ్మవారిని ఆరాధిస్తే.. వారి కష్టాలన్ని దూరమౌతాయంట. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)