Curry Leaves Benefits: కరివేపాకు అని తీసి పారేయకండి.. పరగడుపున తింటే నిండు ఆరోగ్యం
పారేయకుండా తింటే.. ఎన్నో ఔషధ గుణాలున్న కరివేపాకును పారేయకుండా తింటే ఎన్నో లాభాలున్నాయి.
ఖాళీ కడుపుతో రోజుకు
మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవాలంటే మీరు రోజుకు 7-8 కరివేపాకులను ఖాళీ కడుపుతో తినాలి.
కరివేపాకును పరగడుపున తింటే కలిగే ప్రయోజనాలు ఇవే!
కొవ్వు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి కరివేపాకును ఖాళీ కడుపుతో తింటే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి నియంత్రణలో ఉంచుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చు.
ఆరోగ్యకర జుట్టు కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఈసీ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు మేలు చేస్తాయి. నెరిసిన జుట్టు, బట్టతల వంటి సమస్యలకు చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది.
కంటి సంరక్షణ కరివేపాకులో పుష్కలంగా లభించే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని బీటా కెరోటిన్ కంటి శుక్లం, ఇతర కంటి సమస్యలను నివారిస్తుంది.
చక్కెర స్థాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకును తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
స్థూలకాయం కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతుంది. దీంతో కొవ్వు కరిగిపోయి స్థూలకాయం నివారణ జరుగుతుంది. శరీరం ఉత్తేజితమై బరువు తగ్గుతుంది.
చర్మ ఆరోగ్యం కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయ పడతాయి. ఇది వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. కరివేపాకు ముడతలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.