Sprouted Grains: గుప్పెడు మొలకెత్తిన గింజలతో గుండె ఆరోగ్యం భద్రం

Tue, 17 Dec 2024-10:52 pm,

ధాన్యాలు అనేవి ఆహారంలో భాగం చేసుకోవాలి. మొలకెత్తిన గింజలతో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

మొలకలు ఆరోగ్యానికి మేలు: మొలకెత్తిన బీన్స్ ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైననవి. అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్స్ మాదిరి తినవచ్చు. మొలకలను తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

బ్లడ్ షుగర్ నియంత్రణ: మొలకలను తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. దీంతోపాటు బ్లడ్ షుగర్ నియంత్రణ, గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి.

వ్యాధుల నుంచి రక్షణ: విత్తనాలు మొలకెత్తిన తర్వాత తింటే అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. మొలకెత్తిన ఆహారం అన్ని సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది.

మొలకెత్తడం ఇలా: శనగలు మొలకెత్తిన తర్వాత తినాలి. ఏ విత్తనాలు అయినా మొలకెత్తడానికి పెద్ద శ్రమ అవసరం లేదు. విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన వాటిని శుభ్రమైన గుడ్డలో కట్టాలి. ఇలా చేయడం వల్ల విత్తనాలు మొలకెత్తుతాయి.

అధిక ఫైబర్: ఇవి తినడం వల్ల శరీరానికి ఫైబర్ లభిస్తుంది. బరువు తగ్గడానికి ఇది ఉత్తమమైన ఆహారం.

పోషకాలు పుష్కలం: మొలకెత్తిన ఆహారాలలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

మెంతులతో షుగర్‌ కంట్రోల్‌: మధుమేహ వ్యాధిగ్రస్తులు మెంతి మొలకలు తినడం వల్ల ప్రయోజనం పొందుతారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణ చేస్తుంది.

గమనిక: సాధారణ సమాచార కోసం ఇది అందించాం. మీ వైద్యుడి సలహా మేరకు మీరు తీసుకోవాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link