vitamin B12 : చేతులు తిమ్మిర్లు వస్తున్నాయా? కళ్లు మసకబారుతున్నాయా?అయితే విటమిన్ బి12 లోపించినట్లే..ఈ ఫుడ్స్ తినండి.!

Wed, 31 Jul 2024-11:25 am,

Naturally Boost Vitamin B12:ప్రతి మనిషికి విటమిన్ బి12 లేదా కోబాలమైన్ అనేది అత్యవసరమైన పోషకం.ఈ పోషకం రక్త కణాలను తయారు చేసేందుకు అదే సమయంలో నాడీ మండల వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.ముఖ్యంగా మన శరీరం నిర్మాణంలో సైతం విటమిన్ బి12 అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ విటమిన్ బి 12 అనేది మన శరీరంలో ఉత్పత్తి అవదు ఇది కేవలం ఆహార పదార్థాలు ఇతర సప్లిమెంట్ల ద్వారా మాత్రమే మన శరీరం పొందాల్సి ఉంటుంది.   

వైద్యుల సూచన ప్రకారం ప్రతిరోజు కనీసం 2.4 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అనేది అత్యవసరం.అందుకే మన శరీరానికి అవసరమైన బి12 పొందేందుకు ఐదు రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని మీరు ప్రతిరోజు మీ ఆహారంలో చేర్చుకున్నట్లైతే మీ శరీర అవసరాలకు సరిపడా బి12 విటమిన్ మీకు లభిస్తుంది. తద్వారా మీరు అనేక వ్యాధుల బారిన పడకుండా మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు.  

విటమిన్ బి12 అనేది మాంసాహారంలో అత్యధికంగా లభిస్తుంది. ముఖ్యంగా చికెన్ చేపలు కోడిగుడ్లు అదేవిధంగా పాల ఉత్పత్తుల్లో ఈ విటమిన్ బి12 అనేది పుష్కలంగా లభిస్తుందని అమెరికన్ జనరల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ తన పరిశోధనలో తెలిపింది. అందుకే జంతు సంబంధిత ఉత్పత్తుల్లో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది.

శాఖాహారులకు విటమిన్ బి 12 పొందడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే శాఖాహారులకు పాలు అనేవి అత్యంత ఆవశ్యకమైనవిగా చెప్పవచ్చు. పాలు జంతుసంబంధిత పదార్థం అయినప్పటికీ శాకాహారులు పాలను తమ ఆహారంలో ప్రధానంగా తీసుకుంటారు. తద్వారా వీరు విటమిన్ బి12 పుష్కలంగా పొందే అవకాశం లభిస్తుంది. పాలతో పాటు పెరుగు, మజ్జిగ, పనీర్ వంటి పాల సంబంధిత పదార్థాల్లో కూడా విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది.  

ఇక పులిసిన ఆహారాల్లో కూడా విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. వీటిలో ప్రధానంగా పన్నీర్, దోస, ఇడ్లీ,పెరుగు వంటి పదార్థాల్లో విటమిన్ బి 12 అనేది పుష్కలంగా లభిస్తుంది. వీటిల్లో మీ శరీరానికి అవసరమైన హాని కలిగించని బ్యాక్టీరియా ఉత్పత్తి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా ప్రోబయాటిక్ రూపంలో మీ శరీరంలోనే విటమిన్ బి12 ను ఉత్పత్తి చేస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link